నార్నూర్, ఏప్రిల్ 4 : యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని గాంధీచౌరస్తా వద్ద సోమవారం నిర్వహించిన రైతు నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం రాష్ర్టానికో నీతి అవలంబిస్తుందన్నారు. ఇప్పటికైనా యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ తొడసం నాగోరావ్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ సురేశ్, వైస్‌ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు యుర్వేత రూప్‌దేవ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుపై గాదిగూడలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళరాజేశ్వర్, వైస్‌ఎంపీపీ యోగేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాదిరావ్, కో ఆప్షన్ సభ్యుడు బాబు, సర్పంచ్ మెస్రం జైవంత్‌రావ్, భరత్, చంద్రహరి, జంగు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌టౌన్, ఏప్రిల్ 4 : రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని మావల జడ్పీటీసీ రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్, మావల తహసీల్ కార్యాలయాల ఎదుట రైతులు, టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఆదిలాబాద్, మావల టీఆర్ఎస్ మండల నాయకులు లక్ష్మీజగదీశ్, గంగుల కిరణ్, గండ్రత్ రమేశ్, మెట్టు ప్రహ్ల్లాద్, గోవర్ధన్ రెడ్డి, దొగ్గలి రాజేశ్వర్, ఏవన్,గోవర్దన్, నారాయణ. గంగాధర్, పరమేశ్వర్, జంగుబాపు, బుచ్చన్న, భాస్కర్, రమణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాంసి, ఏప్రిల్ 4: మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు సామ నాగారెడ్డి, సర్పంచ్‌లు కృష్ణ, సదానందం, శ్రీనివాస్, యశ్వంత్, నర్సింగ్, ఎంపీటీసీలు రఘు, అశోక్, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ ధనుంజయ్, నాయకులు గంగారాం, ఉత్తమ్, శ్రీనివాస్, పరమేశ్, దాసు, బాపురెడ్డి, దయానంద్ పాల్గొన్నారు.
జైనథ్, ఏప్రిల్ 4 : కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు గ్యాస్, పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, వైస్‌ఎంపీపీ విజయ్ కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గణేశ్‌యాదవ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, జిల్లా డైరెక్టర్ చంద్రయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 4 : పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎంపీపీ శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. అనంతరం భారీ ర్యాలీతో తహసీల్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ సోముకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, సర్పంచ్‌లు కైలాస్, నాగోరావ్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, ఉపసర్పంచ్ గణేశ్టేహెరే, నాయకులు తుకారాం, దేవ్‌పూజే మారుతి, కనక హనుమంత్‌రావ్, మెస్రం తుకారాం, సుంగుపటేల్, సుంకట్రావ్, సోయం భీంరావ్, కుమ్రం రాంషావ్, దశరథ్పటేల్, ఆత్రం మారుపటేల్, రాంనివాస్, సాయినాథ్, నవాబ్బేగ్ పాల్గొన్నారు.
ఉట్నూర్, ఏప్రిల్ 4: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్ అజీమొద్దీన్, వైస్‌ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ నారాయణ, జిల్లా నాయకుడు ప్రభాకర్, నాయకులు పోశన్న, ధరణి రాజేశ్, సీతారాం, స్వామి, భూమన్న, సత్యం, రవి, ఆశన్న, మనోహర్, రవీందర్, మహేందర్, వెంకటేశ్ పాల్గొన్నారు.