
నర్సాపూర్,జనవరి14: మోదీ పాలనలో రైతులపై మోయలేని భారం పడిందని మున్సిపల్ చైర్మన్ మురళియాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువులు, డీజీల్ ధరలు పెంచి రైతుల నడ్డి విరిచిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తే కేంద్ర ప్రభుత్వం మా త్రం ఎరువుల ధరలు పెంచి రైతులను నట్టేట ముంచుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు రాష్ట్ర సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. నేడు 24 గంటల ఉచిత విద్యుత్, చెరువుల పునరుద్ధరణ, కాలేశ్వరం కాల్వ, రైతు బంధు, రైతుబీమా, సబ్సిడీలపై ట్రాక్టర్లు ఇచ్చి ఆదుకుంటుందని గుర్తుచేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్‌ఖాన్, డైరెక్టర్ విద్యాసాగర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, కౌన్సిలర్ రామచందర్, టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
రైతులను నట్టేట ముంచుతున్న కేంద్రం
వెల్దుర్తి, జనవరి 14. దేశానికి అన్నంపెట్టే రైతులను కేంద్ర ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని జడ్పీటీసీ రమేశ్‌గౌ డ్, టీఆర్ఎస్ నాయకులు నరేందర్‌రెడ్డి, ఆంజనేయులు, కృష్ణాగౌడ్ మండిపడ్డారు. వెల్దుర్తిలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ సర్కార్ రైతు సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకుంటుండగా, కేంద్రంలో ఉన్న బీజేపీ వ్యవసాయరంగాన్ని రోడ్డు పాలు చేస్తున్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తూ వ్యవసాయాన్ని పండుగ చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో వలసలు తగ్గాయన్నారు.
రామాయంపేటలో..
రామాయంపేట, జనవరి, 14: కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎరువుల ధరలు తగ్గించాలని రామాయంపేట టీఆర్ఎస్ నాయకుడు, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం డిమాండ్ చేశారు. రామాయంపేటలోని టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. కేంద్రం అవలంబిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. పెంచిన ఎరువుల ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని, లేకుంటే రాష్ర్టానికి వచ్చిన కేంద్ర మంత్రులు, ఎంపీలను అడుగడుగునా నిలదీస్తామన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు మల్యాల కిషన్, చంద్రపు కొండల్‌రెడ్డి, దేవుని రాజు, శ్యాంసుందర్, ఎస్కే హైమద్, బాలుగౌడ్, కృష్ణాగౌడ్, స్వామిగౌడ్, మెట్టు యాదగిరి పాల్గొన్నారు.
రైతులను కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర
మనోహరాబాద్, జనవరి 14 : రైతులను కూలీలుగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి దుయ్యబట్టారు. కార్పొరేట్ శక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. మనోహరాబాద్లోఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఆరుగాలం కష్టపడి పని చేసే రైతులపై ఏదో రూపంలో బీజేపీ ప్రభుత్వం భారం వేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు ఆర్థికంగా పుంజుకుంటున్నారన్నారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఎరువుల ధరలు పెంపడం సరికాదు
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడం సరికాదని మెదక్ ప్రాథమిక సహకార సంఘం వైస్ చైర్మన్ కాస సూర్యతేజ శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి రైతులను ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు.
కేంద్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నది
శివ్వంపేట, జనవరి 14 : కేంద్రం రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజారమణాగౌడ్ అన్నారు. శివ్వంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేం ద్రం 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి ఎరువులు, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచి మోయలేని భారాన్ని మోపుతున్నదని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు వంజరి కొండల్, ముద్దగల్ల లక్ష్మీనర్సయ్య, వెంకన్నగారి కొండల్రావు, వంజరి గౌరిశంకర్ పాల్గొన్నారు.
కేంద్రంపై నిరసన వెల్లువ
చేగుంట, జనవరి 14 : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని,పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని నార్సింగి టీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధిలు పేర్కొన్నారు.మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు నార్సింగిలో ఎంపీపీ చిందం సబిత ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..కేంద్రప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేశ్, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ మ్యాకల పరమేశ్, మడూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి,టీఆర్ఎస్ పట్టణశాణ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి,మైనార్టీ అధ్యక్షుడు రుక్ముద్దీన్,భూపతిరాజు,సర్పంచ్‌లు షేక్‌షరీఫ్, ఛత్రనాయక్, మల్లేశం,తాటికొండ సిద్ధు,కుమ్మరి నర్సింహులు, సత్తయ్య, గణేశ్, కాస్లాపూర్ యాదగిరి, మహేశ్‌గౌడ్, బకార్ పాల్గొన్నారు.