
ముదిగొండ, జనవరి 14: తెలంగాణ పథకాలు దేశం గర్వించేలా ఉన్నాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. వీటి స్ఫూర్తితో ఇతర రాష్ర్టాలు తమ వద్ద ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు. మండలంలోని వల్లభి గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతుబంధు సంబురాలకు ఆయన హాజరయ్యారు. తొలుత ఎడ్లబండిపై కొద్ది దూరం ఊరేగింపుగా వెళ్లారు. ఆ తరువాత ఆయనే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ బయలుదేరారు. ట్రాక్టర్ల ర్యాలీతో సభా స్థలి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ పల్లెల్లో సంక్రాంతి పండుగ వారం రోజుల ముందే వచ్చిందని, అన్నదాతలందరూ రైతుబంధు సంబురాలను జరుపుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్ఫూర్తితో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కల్యాణలక్ష్మి పథకాన్ని తమ వద్ద అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. రైతుబీమా పథకంలో అన్నదాతల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ పోట్ల ప్రసాద్, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, సర్పంచ్ పోట్ల కృష్ణకుమారి, టీఆర్ఎస్ వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటేశ్వర్లు, తోట ధర్మారావు, పచ్చా సీతారామయ్య, బంక మల్లయ్య, ఆదినారయణరెడ్డి, మీగడ శ్రీనివాస్ యాదవ్, పోట్ల రవి, రమేశ్, బాబు, చిమర్రి ఎల్లయ్య తదితఋరులు పాల్గొన్నారు.