శేరిలింగంపల్లి : మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఆటోను ఢీకొట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
కొండాపూర్ రాఘవేంద్రకాలనీకి చెందిన కె. శ్రీనాథ్ (26), గుండప్ప (25) లు స్థానికంగా కాలనీలో ఉన్న వైన్‌షాపులో ఆదివారం రాత్రి మద్యం సేవించారు.అనంతరం రాత్రి 9గంటల ప్రాంతంలో హైటెన్షన్ రహాదారిలో యమహా ఎఫ్‌జెడ్ బైక్‌పై నిర్లక్ష్యంగా వెళ్తు ఆటోను ఢీకొట్టారు.
ఆటో డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు సదరు యువకులకు బ్రీత్ ఎన్‌లైజర్‌తో పరీక్షించగా శ్రీనాథ్‌కు 320 ఎంఎల్, గుండప్ప కు 150 ఎంఎల్‌గా తేలింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆటోలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు పేర్కొన్నారు.