
నేరేడుచర్ల, సెప్టెంబర్ 4 : టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి కోరారు. శనివారం మండలంలోని మేడారం, బక్కయ్యగూడెం, ఫత్తెపురంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మేడారం గ్రామాధ్యక్షుడిగా కటికోలా లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా నకిరేకంటి రాజేశ్, బక్కయ్యగూడెం అధ్యక్షుడు శానం వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా కర్ణం అరవింద్, ఫత్తెపురం గ్రామాధ్యక్షుడిగా మచ్చ వీరస్వామి, ప్రధాన కార్యదర్శిగా రాగిరెడ్డి రాంబాబురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు అరిబండి సురేశ్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి, యళ్లబోయిన లింగయ్య, ఉపాధ్యక్షుడు వస్కుల సుదర్శన్, ఎంపీటీసీ మండలి రాజేశ్, నాయకులు అన్నపురెడ్డి నారాయణ రెడ్డి, ఇంజమూరి రాములు, పిడమర్తి రాజు, మధుకుమార్ పాల్గొన్నారు.
మరింత బలోపేతం చేయాలి..
కోదాడ రూరల్ : టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థ్ధాయిలో మరింత బలోపేతం చేసేందుకు గ్రామకమిటీలు కృషిచేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు బాషబోయిన భాస్కర్ సూచించారు. మండలంలోని అల్వాలపురం, దొరకుంట, నల్లబండగూడెంలో టీఆర్ఎస్ గ్రామకమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నంద్యాల రాంరెడ్డి, జడ్పీ కో-ఆప్ష్షన్ సభ్యుడు జానీమియా, గండ్ర యాదగిరి, ఎంపీటీసీ శంకర్శెట్టి కోటేశ్వర్ రావు, యరమాల క్రాంతి, పీఏసీఎస్ చైర్మన్ ముత్తవరపు రమేశ్, ఎస్టీ సెల్ విభాగం మండలాధ్యక్షుడు ధరావత్ బుజ్జి, బెంజిమెన్, కొళ్లూరి రామారావు, వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
మేళ్లచెర్వు మండలంలో..
మేళ్లచెర్వు : మేళ్లచెర్వు మండలంలోని కప్పలకుంటతండా, నల్లబండ గూడెం గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామకమిటీలను ఎన్నుకున్నారు. కప్పలకుంట తండా గ్రామశాఖ అధ్యక్షుడిగా భూక్యా శ్రీనునాయక్, ఉపాధ్యక్షుడిగా బాణోతు బాలూనాయక్, ప్రధాన కార్యదర్శిగా బాణోతు వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. నల్లబండగూడెం అధ్యక్షుడిగా దేశిరెడ్డి వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కూర వీరబాబు, ప్రధాన కార్యదర్శిగా తోడేటి సైదులు ఎన్నికయ్యారు. వెంకట్రాంపురం గ్రామాధ్యక్షుడిగా షేక్ సైదాసాహెబ్, ఉపాధ్యక్షుడిగా యాంపంగు హుస్సేన్, ప్రధాన కార్యదర్శిగా షేక్ సైదా నియమతులయ్యారు. ఎర్రగట్టుతండా గ్రామాధ్యక్షుడిగా బాణోతు భిక్షం, ఉపాధ్యక్షుడిగా రాధాబాయి, ప్రధాన కార్యదర్శిగా భూక్యా రవినాయక్ ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సూరిశెట్టి బసవయ్య, ప్రధాన కార్యదర్శి వీరనాగిరెడ్డి, జడ్పీకోఆప్షన్ ఇమ్రాన్ పాల్గొన్నారు.
బిల్యానాయక్ తండా గ్రామ కమిటీ..
మఠంపల్లి : మండలంలోని బిల్యానాయక్తండాలో టీఆర్ఎస్ గ్రామకమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకుడు సాముల పుల్లారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోలాహలం కృష్ణంరాజు, జడ్పీటీసీ జగన్నాయక్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. గ్రామశాఖ అధ్యక్షుడిగా బాణోతు కాంతారావు, ఉపాధ్య్యక్షుడిగా ధరావత్ గోవిందు, కోశాధికారిగా బాణోతు వెంకటేశ్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతి, టీఆర్ఎస్ నాయకులు కోట పాల్గొన్నారు.
నడిగూడెం మండలంలో..
నడిగూడెం : మండలంలోని వల్లాపురం, సిరిపురం, నారాయణపురంలో టీఆర్ఎస్ గ్రామకమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వారు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణిపుల్లారెడ్డి, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, పార్టీ మండలాధ్యక్షుడు నర్సిరెడ్డి, బడేటి చంద్రయ్య, నాగన్న, కాసాని వెంకటేశ్వర్లు, వట్టికూటి చలపతి సురేశ్ పాల్గొన్నారు.