
ఖమ్మం, జనవరి 22: గ్రానైట్, గ్రానైట్ అనుబంధ చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ఇతర సమస్యలపై పరిశ్రమ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మైనింగ్ శాఖ డీఎంజీ రోనాల్డ్ రోస్తో వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఆధ్వర్యంలో పరిశ్రమ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. సీఎకేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రతినిధులు హామీ ఇచ్చారు. మైనింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, గ్రానైట్ పరిశ్రమల సంఘం ప్రతినిధులు పీ.శంకర్, తమ్మినేని వెంకట్రావు, ఉప్పల వెంకటరమణ, విన్నకోట అజయ్ తదితరులు పాల్గొన్నారు.