
ఊట్కూర్, జనవరి 16 : క్రీడలు స్నేహభావాన్ని పెం పొందిస్తాయని సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, వార్తా తరంగా లు ఎడిటర్ విజయరామరాజు అన్నారు. మండలకేంద్రం లో స్వర్గీయ ఆర్ఎంపీ వైద్యుడు వెంకటయ్య, టీఆర్ఎస్ యువ నేత శివరాజ్ జ్ఞాపకార్థం నిర్వహించిన మండలస్థా యి క్రికెట్ పోటీలో గెలుపొందిన జట్టు సభ్యులకు ఆదివా రం మెమెంటో, నగదు బహుమతులను అందజేశారు. మా నసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి జట్టు గెలుపే ధ్యేయంగా పా టుపడాలన్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, ఎంపీటీసీ హన్మంతు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, ఉపసర్పంచ్ రహిమాన్, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి శివరామరాజు, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, ని ర్వాహకుడు బాల్రామ్ తదితరులు పాల్గొన్నారు.
క్వీజ్ పోటీలు
మరికల్, జనవరి 16 : మండలంలోని అప్పంపల్లిలో స్వామి వివేకానంద యువజన వారోత్సవాలను పురస్కరించుకొని ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శనివారం క్వీజ్ పోటీలను నిర్వహించారు. పోటీలో గెలుపొందిన వారికి, అలాగే క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి విశ్వహిందూ పరిషత్ మండల కార్యదర్శి అనిల్‌కుమార్ భ గవద్గీత పుస్తకాలను అందజేశారు.
కబడ్డీ, క్రికెట్, ముగ్గుల పోటీలు
నారాయణపేట, జనవరి 16 : దామరగిద్ద మండలకేంద్రంతోపాటు, ముస్తాపేట, అన్నాసాగర్ గ్రామాల్లో క్రికెట్, కబడ్డీ, ముగ్గుల పోటీలు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్నాసాగర్ క్రికెట్ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ముస్తాపేట కబడ్డీ, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి సర్పంచ్ లాలప్ప బ హుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అంజిలయ్యగౌడ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మోహన్, ఆయా గ్రా మాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గుడిగండ్లలో…
మక్తల్ రూరల్, జనవరి 16 : మండలంలోని గుడిగండ్లలో ఆదివారం క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. స్వర్గీయులు యాలాల రాంలింగం, శరణమ్మ జ్ఞాపకార్థం శివాజీ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు రూ.20116, రన్ప్క్రు రూ.10116 నగదుతోపాటు షీల్డు, మెమెంటోలు అందజేస్తామని ని ర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరి, ఎంపీటీసీ లక్ష్మి, టోర్నీ నిర్వాహకులు యాలాల వీరేశం, చంద్రకాంత్, గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి, పూజారి కుర్మయ్య, ఉపసర్పంచ్ తిరుపతయ్య, రేషన్ డీల ర్ చంద్రశేఖర్, రాము, నరేశ్, ఆంజనేయులు, రాజు తదితరులు పాల్గొన్నారు.