కమాన్‌చౌరస్తా, మార్చి 2: జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రజలు ఉగాది పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఆలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చనలు, అభిషేకాలు, సహస్రనామార్చన, హోమం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో, కాలనీల్లో ఉగాది పచ్చడి పంపిణీ చేసి, పంచాంగ శ్రవణం గావించారు. కాగా, జిల్లా కేంద్రంలోని పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు. మేయర్ వై సునీల్ రావు, టీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీనర్సింహా రావు, కాసుగంటి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మనాయక వెలమ సంఘం అధ్యక్షుడు జువ్వాడి మన్మోహన్ రావు మాట్లాడారు. ఇక్కడ కార్పొరేటర్ వాల రమణారావు, సంఘం ఉపాధ్యక్షుడు బుద్ధినేని నర్సింగారావు, సంయుక్త కార్యదర్శి జువ్వాడి అమరేందర్ రావు, కోశాధికారి మేచినేని దేవేందర్ రావు, కార్యవర్గ సభ్యులు సుంకిశాల సంపత్ రావు, పీచర నరేందర్ రావు, జూపల్లి మాధవ రావు, బోయినిపల్లి అశోక్ రావు, అయిలేని సుధాకర్ రావు, గండ్ర భాసర్ రావు, జువ్వాడి మారుతీ రావు, వంగపెల్లి వెంకటనారాయణ రావు, చిట్నేని రఘురాంరావు, పొలాడి మాధవ రావు, గండ్ర మంజుల, బొంపెల్లి ఉమామహేశ్వర్ రావు పాల్గొన్నారు. అలాగే, 9వ డివిజన్లో కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మేయర్ వై సునీల్ రావు హాజరై కాలనీ ప్రజలకు ఉగాది పచ్చడి, బూరెలు పంపిణీ చేశారు. కరీంనగర్ బస్టాండ్‌లో విశ్వహిందూ పరిషత్ , బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఇందులో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, బజరంగ్దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్, వీహెచ్‌పీ నగర కార్యదర్శి తోట రాజేందర్, ఉప్పుల శ్రీహరి, భగవాన్‌రావు, సాయితేజ, బెల్లం నరేందర్, సాయి, వినయ్, పవన్‌కుమార్ పాల్గొన్నారు. సప్తగిరికాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. భక్తులకు ఉగాది పచ్చడి, తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. వేడుకల్లో ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు, భక్తులు పాల్గొన్నారు. భాగ్యనగర్‌లోని సాయిబాబా ఆలయంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు పంచాంగ శ్రవణం గావించారు. రామచంద్రాపూర్‌లోని హనుమాన్ ఆలయంలో కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ-వేణు ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు పంచాంగ శ్రవణం చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే, గాయత్రీనగర్‌లోని శ్రీ గణేశ శారదాశంకరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేశారు. భగత్‌నగర్‌లోని అంజనాద్రి గుట్టపై జరిగిన వేడుకల్లో అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. వేడుకల్లో చిలకపాటి హనుమంతరావు, అర్చకుడు రామకృష్ణశర్మ, భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం గంజ్‌లోని వరసిద్ధి వినాయక ఆలయంలో అర్చకుడు మంగళంపల్లి వేణుగోపాల్‌శర్మ పంచాంగ శ్రవణం చేశారు. వ్యాపారులు, స్థానికులు పాల్గొన్నారు. నగరంలోని స్లేట్ పాఠశాలలో సద్భావన ఫోరం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మతాలకతీతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫోరం గౌరవాధ్యక్షుడు మహ్మద్ కైరుద్దీన్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథులుగా కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, బోనాల శ్రీకాంత్, గుగ్గిళ్ల జయశ్రీ, బరత్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో అందరూ కలిసికట్టుగా జీవించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు వంగపల్లి రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి మజీద్ అలీ, సాంస్కృతిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, యువజన సంఘాల సమితి అధ్యక్షుడు డీ ప్రశాంత్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు గుగ్గిళ్ల శ్రీనివాస్, గడ్డం జగత్పాల్ రెడ్డి, నరేన్ కాంత్, సునీల్ రెడ్డి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఏప్రిల్ 2: నగరంలోని 18, 19వ డివిజన్ పరిధిలో గల శాతవాహన కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మనువాడ శంకర్, ప్రధాన కార్యదర్శి నలువాల గిరిధర్‌రావు, సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
విద్యానగర్, ఏప్రిల్ 2: నగరంలోని అంధుల పాఠశాల, స్వధార్ హోమ్‌లో భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు స్వీట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. భరోసా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అకినపల్లి నాగరాజు మాట్లాడుతూ, ఉగాది పండుగను అంధ విద్యార్థులు, అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో అకినపల్లి శివజ్యోతి నాగరాజు, అజయ్ విష్ణు తేజ, వర్షిత యాదవ్, ఆశ, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేకుర్తిలోని శ్రీ శివ సాయి వృద్ధాశ్రమంలో అనాథ వృద్ధులతో కలిసి ఉగాది సంబురాలు జరుపుకోన్నారు. వృద్ధులకు పులిహోర, బూరెలు, ఉగాది పచ్చడి, మజ్జిగ ప్యాకెట్లు, దుస్తులు అందజేశారు. ఫౌండేషన్ అధ్యక్షురాలు చకిలం స్వప్న, సభ్యులు శ్రీనివాస్, స్వాతి, రాణి, శ్రీదేవి, మనీ, అంజలి, రంజిత్, విక్రం తదితరులు పాల్గొన్నారు.