
పట్టు పురుగుల పెంపకం చేపడుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. షెడ్ నిర్మాణానికి, మొక్కలు నాటడానికి, ఇతర పరికరాలు సమకూర్చుకోవడానికి గాను రాష్ట్ర ప్రభు త్వం ఓసీలు, బీసీలకు 50శాతం రాయితీని కల్పిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 65శాతం సబ్సిడీని అందిస్తున్నది. పట్టు పరిశ్రమ శాఖ నుంచి ఈ సబ్సిడీని రైతులు పొందవచ్చు. యూనిట్ కాస్ట్ రూ.4 లక్షలు ఉంటుంది. ఇందులో 50 శాతం సబ్సిడీ ఉంటుంది. రెండు ఎకరాల్లో మొక్కలు నాటడానికి గాను రూ. 25,000, రేరింగ్ షెడ్ నిర్మాణానికి రూ. 2,00,00 ప్రభుత్వం సబ్సిడీని అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 65శాతం సబ్సిడీతో మొక్కలు నాటడానికి రూ.32,500, రేరింగ్ షెడ్ నిర్మాణానికి 2,60,00 అందిస్తున్నది. ఉపాధిహామీ పథకంలో మొక్కలు నాటడానికి ఒక్కో రైతుకు కూలీలకు గానూ రూ.36,508, రేరింగ్ షెడ్ నిర్మాణానికి రూ.4,580 ఇస్తుంది. మెటీరియల్ పేమెంట్ కింద మొక్కలు నాటడానికి రూ.3,270. రేరింగ్ షెడ్ నిర్మాణానికి రూ.88,845 ఇస్తున్నది. అంటే ఒక్క రైతుకు మొత్తంగా పట్టు పరిశ్రమ శాఖ నుంచి ఓసీ, బీసీలకు రూ.2,25,000, ఉపాధిహామీ నుంచి రూ.1,32,843 మొత్తంగా రూ. 3,57,843 అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు పట్టుపరిశ్రమ శాఖ నుంచి 2,92,500, ఉపాధిహామీ పథకంలో రూ.1,32,843, మొ త్తంగా రూ. 4,25,343 సబ్సిడీని అం దించి ప్రోత్సహిస్తున్నది. దీంతో ఇటీవలి కాలంలో రైతులు పట్టు సాగుకు మొగ్గు చూపుతున్నారు.
పట్టు పురుగుల పెంపకంలో ఏడాదికి 9 నుంచి 10 పంటలు తీయవచ్చు. పంటకాలం నెల రోజుల్లో పూర్తవుతుంది. ఇది అయిపోగానే రెండో పంట వేసుకోవచ్చు. బెంగళూరు నుంచి రైతులు పట్టు గుడ్లను తెచ్చుకుంటున్నారు. వంద గుడ్లకు రూ.800 ఖర్చు అవుతున్నది. ఒక పురుగు 600 గుడ్లు పెడుతుంది. దీని లెక్క ప్రకారం ఇది ఒక గుడ్డుగానే పరిగణిస్తారు. వంద గుడ్లకు 60వేల పిల్లలు అన్నమాట. ఇలా ఒక్కో రైతు పట్టు పురుగుల పెంపకాన్ని చేపడతారు. ఇలా తీసుకువచ్చిన పట్టు గుడ్లను రైతులు జాగ్రత్తగా నల్లని బట్ట లేదా పేపర్‌తో ఉన్న చట్రాల్లో విడి గుడ్లను సమాన పరిచి, తెల్లని పారదర్శకంగా ఉండి కాంతి ప్రసరించునట్లుగా ఉన్న పేపరుతో కప్పి లోపలి చట్రంలో ఉంచుతారు. ఇలా కప్పి ఉంచిన చట్రాలకు 16 గంటల కాంతి, 8 గంటల చీకటి ఉండే విధంగా గుడ్లను పొదగిస్తారు. వీటిలో కొన్ని శాంపిల్‌గా తీసుకొని చిన్న పాటి అగ్గిపెట్టెలో పొదగిస్తారు. గడ్లు పగిలినవా లేదా అనే విషయం తెలుసుకోవడానికి అగ్గిపెట్టెలో ఉంచిన గుడ్ల ద్వారా తెలుసుకోవచ్చు. వీటిని పరిశీలించిన తర్వాతనే
లాభదాయక పంటల వైపు రైతులు దృష్టిసారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో సిద్దిపేట జిల్లాలో పట్టు పురుగుల పెంపకానికి రైతులు ముందుకు వస్తున్నారు. మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల పరిశ్రమ చేపట్టి రైతులు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఏడాదికి పది నుంచి పదకొండు వరకు పంటలను తీసి రైతులు నెలనెలా ఆదాయం పొందుతున్నారు. ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. దీంతో రైతులు ముందుకు వస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 650 ఎకరాల్లో పట్టుపరిశ్రమ చేపడుతున్నారు. ఈసారి కొత్తగా 167 ఎకరాల్లో మల్బరీ తోటలు పెంచి పట్టుపురుగులు పెంచుతున్నారు. పట్టు పురుగుల పెంపకంలో ప్రస్తుతం రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.
సిద్దిపేట, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పట్టు పురుగుల పెంపకంతో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. నెలనెలా ఆదాయం వస్తున్నది. ఏడాదికి పది పంటలను తీస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో సిద్దిపేట జిల్లాలో రైతులు పట్టు పురుగుల పెంపకం వైపు దృష్టిసారిస్తున్నారు. పట్టు సాగుచేసే రైతులకు మొక్కలు నాటడానికి, షెడ్ నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందజేస్తున్నది. ఓసీ, బీసీలకు 50శాతం, ఎస్సీ ఎస్టీలకు 65 శాతంపై పట్టు పరిశ్రమ శాఖ సబ్సిడీ రుణాలు అందిస్తున్నది. వీటిని సద్వినియోగం చేసుకుంటూ పలువురు రైతులు పట్టు పరిశ్రమ చేపడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లాలో పట్టు పరిశ్రమను సాగును ప్రోత్సహిస్తున్నారు. పట్టు పురుగుల పెంపకానికి రైతులకు ఖర్చు తక్కువగానే ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మాదిరిగా నెలనెలా మంచి వేతనం పట్టు పురుగుల పెంపకంతో రైతులు సంపాధిస్తున్నారు.
ఆ చట్రాన్ని తీస్తారు. చట్రాల్లో ఉన్న గుడ్ల నుంచి పగిలిన పురుగులపై డిసిస్ఫెక్షన్ గావించిన దోమతెరలాంటి వలను చాకీ కట్టుటకు 30 నిమిషాల ముందు కప్పుతారు. పట్టు పురుగులను పెంచుటకు స్టాండులు, ఈకలు, చాప్‌స్టిక్స్, బేసీన్లు, డిసిస్ఫెక్షన్ గావించిన గోనె తట్టలు, నూలు బట్టలు, మైనపు పేపర్, హీటర్ తేమాంశం చేకూర్చే యంత్రం, ఆకు సంగ్రహించే బుట్టలు, చీమల నివారణ తొట్టిలు తదితర వస్తువులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పట్టు పురుగులకు తొలిమేతగా మల్బరీ మొక్క చివరి ఆకును చిన్నగా కట్‌చేసి వేస్తారు. పట్టు పురుగు నిద్రావస్తలోకి 24గంటలు వెళ్తుంది. ఆ సమయంలో మేతను వేయరు. నిద్రావస్తలో నుంచి రాగానే ఈకల సహాయంతో వాటిని వేరు చేస్తారు. ఇలా మొత్తం 5 దశల్లో పట్టు పురుగుల పెంపకం జరుగుతుంది. ప్రతి మూడు రోజులకు ఒక్కసారి నిద్రలోకి పట్టు పురుగు వెళ్తుంది.(తన పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది). పట్టు పురుగు పెరిగిన కొద్ది మేతను అధికంగా తీసుకుంటుంది. చివరి దశలో రోజుకు రెండుసార్లు మేతను వేస్తారు. నాలుగో దశ తర్వాత కండెకు వస్తుంది. ఇలా కండెకు వచ్చిన దానిని వేరుచేసి మార్కెట్‌కు తీసుకెళ్తారు. మొత్తంగా పంట కాలం 21 రోజుల నుంచి 25 రోజుల్లో పూర్తవుతుంది.
సిద్దిపేట జిల్లాలో మల్బరీ తోటల పెంపకానికి రైతులు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా లో 650 ఎకరాలు తోటలు వేశారు. ఈ ఏడాది కొత్తగా 167 ఎకరాల్లో సాగుచేశారు. పట్టు సాగులో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు.
పట్టు పురుగుల పెంపకాన్ని ఆరేండ్లుగా చేపడుతున్నా. వ్యవసాయ బావివద్దనే రేరింగ్ షెడ్ నిర్మాణం చేసుకున్నాం. నాలుగు ఎకరాల్లో మల్బరీ తోటను పెట్టాం. ఏడాది పొడవునా క్రాప్ తీసేందుకు నాలుగు ఎకరాల్లో తోట పెట్టాం. మొదట రెండు ఎకరాల్లో ఆకు అయిపోగానే మరో రెండు ఎకరాల్లో ఆకు వస్తుం ది. దీంతో ఏడాది పాటు క్రాప్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి క్రాప్‌లో ఖర్చులు పోను రూ. 90వేల నుంచి రూ.లక్ష వరకు మిగులు తున్నాయి.
-ఐలయ్య, పట్టు రైతు, చంద్లాపూర్, చిన్నకోడూరు మండలం (సిద్దిపేట జిల్లా)
సిద్దిపేట జిల్లాలో 650 ఎకరాలకు పైగా పట్టు సాగుచేశారు. ఈ ఏడాది ఇప్ప టి వరకు 167 ఎకరాలు సాగైంది. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ క్లస్టర్ కింద 106 ఎకరాలు సాగు చేయగా , జిల్లాలోని వివిధ మండలాల్లో 61 ఎకరాలు సాగు చేశారు. మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.
జిల్లాలో పట్టు పురుగులు పెంచే రైతులకు అందుబాటులో ఉండి వారికి అన్నిరకాలుగా సేవలందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ రుణాలను వారికి తెలియజేసి మరింత మంది సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నాం. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాలో పట్టుసాగు చేసే రైతుల సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.
పట్టు పురుగుల పెంపకంలో మంచి లాభాలున్నాయి. నాలుగు ఎకరాల్లో పట్టు పురుగుల పెంపకం కోసం మల్బరీ తోటను సాగుచేశా. బావివద్దనే రేరింగ్ షెడ్ నిర్మాణం చేసుకున్నా. మా కుటుంబ మొత్తం కలిసి పని చేసుకుంటాం. ఏడాదికి 10 నుంచి 11 పంటలను తీయవచ్చు. ప్రతి పంట నెల రోజుల వ్యవధిలో చేతికి వస్తుంది. ప్రతిసారి 250 గుడ్లను తీసుకువచ్చి పట్టు పురుగులను పెంచుతున్నాం. ప్రభుత్వ సహకారం బాగా ఉం ది. ఇటీవల మా తోటలను మంత్రి హరీశ్‌రావు సందర్శించారు.