
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 25 : సిద్దిపేట ప్రభుత్వ జనరల్ దవాఖానలో 24గంటల వ్యవధిలో 30ప్రసవాలు సమర్థవంతంగా చేసినట్లు సూపరిండెంట్ డా. కిశోర్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి హరీశ్‌రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ తమిళ అరసి, వైద్యుల సహకారంతో అత్యున్నత సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. 30ప్రసవాల్లో 17సాధారణ ప్రసవాలు కాగా, కొన్ని క్లిష్టమైన ప్రసవాలను కూడా వైద్యు లు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేశారు. మంత్రి హరీశ్‌రావు వైద్య సిబ్బందిని అభినందించినట్లు ఆయన తెలిపారు.