
నేడు దుబ్బాక బాలాజీ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠాపన
హాజరు కానున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రముఖులు
సుమారు 40వేల మంది వస్తారని ట్రస్టు సభ్యుల అంచనా
దుబ్బాక, ఆగస్టు 19 : విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి దుబ్బాక బాలాజీ ఆలయం సిద్ధమైంది. పుష్కర కాలంగా నిర్మించిన దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. నేడు(శుక్రవారం) త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరుగనున్నది. చినజీయర్ స్వామి ఉదయం 6 గంటలకు దేవాలయానికి చేరుకుని, ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10. 28 గంటలకు లక్ష్మీసహిత వేంకటేశ్వరసాస్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం జరిపిస్తారు. అనంతరం నయనోన్మీలనం, దీస్టి కుంభం, ప్రథమారాధన, మంత్రాదానం నివేదన, మంగళాశాసనం, విన్నపాలు, శాత్తుమురై ఆళ్వార్ ఆచార్య మరియాద, శాంతి కల్యాణం, తీర్థగోష్టి మహాదాశీర్వాచనం, ఆచార్య సన్మానం. సాయంత్రం 5.30 గంటలకు చినజీయర్ స్వామి ప్రత్యేక్ష పర్యవేక్షణలో శ్రీనివాస స్వామి ప్రథమ కల్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్థికశాక మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థాని క ఎమ్మెల్యే రఘునందన్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.
ఎంపీ దంపతుల ప్రత్యేక పూజలు
గురువారం సాయంత్రం దేవాలయంలో నిర్వహించిన ధ్వజ స్తంభ ఆరోహణ, స్వామి వారి పవళింపు కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తన సతీమణి మంజులతతో హాజరయ్యారు. ఆలయంలో రాత్రి వరకు జరిగిన పూజల్లో ఎంపీ దంపతులతో పాటు ట్రస్టు సభ్యుల కుటుంబీకులతో పాల్గొన్నారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి తన స్వగ్రామామైన పోతారంలో బస చేసి, శుక్రవారం ఉదయం దేవాలయానికి రానున్నారు.
భారీగా పోలీసు బందుబస్తు..
వేంకటేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రముఖులు హాజరు కానుండడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం దుబ్బాక పోలీసు సర్కిల్ కార్యాలయం వద్ద పోలీసు అధికారులకు రూట్ల వారీగా విధులు నిర్వహించేందుకు సిద్దిపేట ఏసీపీ సైదులు ఆదేశాలు జారీ చేశారు. 7 సెక్టర్లుగా విభజించి మొత్తం 300 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారని ఏసీపీ తెలిపారు.
భక్తుల సహకరించాలి : ట్రస్టు చైర్మన్
విగ్రహ ప్రతిష్ఠ వేడుకలకు వచ్చే భక్తుల సహకరించాలని, వాహనాలను వివిధ రూట్లలో కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేయాలని దేవాలయ ట్రస్టు చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ కోరారు. దుబ్బాక పట్టణంలో నలుదిక్కుల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్, రామాయంపేట, సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి (హబ్షీపూర్ మీదుగా) దుబ్బాకకు వచ్చే భక్తుల వాహనాలను వంద పడకల దవాఖాన ఆవరణలో పార్కింగ్ చేయాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల నుంచి వచ్చే భక్తులకు చెల్లాపూర్ రోడ్డులో మార్కెట్‌యార్డులో.., కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చే వారి కోసం లచ్చపేట రోడ్డులో బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కన గల వెంచర్లో.., సిద్దిపేట నుంచి దుంపలపల్లి మీదుగా వచ్చే వాహనాలు సబ్ రిజిస్ట్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో వాహనాలు పార్కింగ్ ఏర్పాటు చేశారన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు పార్కింగ్ స్థలాల నుంచి ఆలయ ఆటోలు, ఇతర వాహనాల ద్వారా తీసుకొస్తారని చెప్పారు.
సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి.. ఆధ్యాత్మికత..
దుబ్బాక, ఆగస్టు 19 : ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, ఆధ్యాతిక్మత పెరుగుతున్నాయని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. గురువారం దుబ్బాకలో బాలాజీ దేవాలయాన్ని వారితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణశర్మ సందర్శించారు. వీరికి ఆలయ ట్రస్టు చైర్మన్ శ్రీధర్, కార్యదర్శి రాజు, సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో నిర్వహిస్తున్న హోమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆనంతరం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దుబ్బాకలో 12ఏండ్లుగా ఎంతో కష్టపడి నిర్మించిన బాలాజీ దేవాలయం దుబ్బాకకే గాకుండా సిద్దిపేట జిల్లాకే గర్వకారణంగా మారిందన్నారు. దేవాలయ నిర్మాణం ఎంతో సుందర రమణీయంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతలో ముందుండడం చాలా సంతోషకరమన్నారు. ఇం దులో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిల కృషి మరిచిపోలేనిదన్నారు. దేవాలయ నిర్మాణంలో భాగస్వాములైన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.