
వెల్దుర్తి, ఆగస్టు 17 : గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మాసాయిపేట మండలం కొప్పులపల్లిలో రూ.13 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, పల్లెప్రకృతి వనం, బొమ్మారంలో నిర్మించిన సీసీ రోడ్డు, వైకుంఠధామాలను ఎమ్మె ల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేక నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు కనకమ్మ, మధుసూదన్‌రెడ్డి, ఫకీరా, అశోక్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
మనోహరాబాద్, ఆగస్టు 15 : ఆడపిల్లలను స్వేచ్ఛగా పెరగనిద్దామని, మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి సూచించారు. శివ్వంపేట మండల చెండి ఫంక్షన్ హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఆడపిల్లల పరిరక్షణ, బాల్యవివాహాల నిర్మూలన, బాల ల పరిరక్షణ కమిటీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్యవివాహాలతో ఆడపిల్లల బంగారు భవిష్యత్‌ను నాశనం చేయొద్దన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. అనంతరం చిన్నారులు ఎమ్మెలేకు రాఖీ కట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, తహసీల్దార్ రవికుమార్, ఎంఈవో బుచ్యానాయక్, ఎంపీడీవో నవీన్‌కుమార్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు లావణ్యమాదవరెడ్డి, సీడీపీవో హేమభార్గవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు స్వరూప, సరళకుమారి, జ్యోతి, శశికళ, కవిత, సర్పంచ్‌లు పాల్గొన్నారు.