
చేర్యాల, సెప్టెంబర్ 9 : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన కొమురవెల్లి మల్లన్న క్షేత్రం టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ కృషితో దినదినాభివృద్ధి చెందుతున్నదని, భవిష్యత్తులో దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. రూ.2.70 కోట్లతో మహామండప విస్తరణ, పాకశాల (స్వామి వారి నివేదనశాల) నిర్మాణ పనులకు గురువారం ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఎంపీపీ తలారి కీర్తణ కిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, ఈవో బాలాజీతో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కొమురవెల్లి క్షేత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కనీసం తాగునీరు లేక భక్తులు అప్పట్లో ఇబ్బందుల పడ్డారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పాలనలో భక్తులకు సత్రాలు అందుబాటులోకి తేవడంతో పాటు తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. టెంపుల్ సిటీగా కొమురవెల్లిని అభివృద్ధి చేసేందుకు తయారుచేసిన ప్లాన్‌లో కొన్ని మార్పులు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. స్వామి వారి క్షేత్ర సమీపంలో బండగుట్టకు రూ.10 కోట్లతో 50 కాటేజీల నిర్మాణం కొనసాగుతున్నదని, దాసారం గుట్టపైన డోనర్ స్కీంలో గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా రోడ్డును నిర్మిస్తున్నామని, కొన్ని కారణాలతో పనులు ముందుకు సాగడం లేదని, త్వరలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. దాసారం గుట్టపై డోనర్ స్కీంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, పలువురు దాతలు ఆధునిక వసతులతో గెస్ట్‌హౌస్‌లు నిర్మించేందుకు ముం దుకు వచ్చినట్లు తెలిపారు. తిరుపతి తరహాలో ఆధునిక వసతులతో గెస్ట్‌హౌస్‌లు నిర్మించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా మార్చాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మల్లన్న ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ధర్మకర్తలు ఉట్కూరి అమర్‌గౌడ్, దినేశ్ తివారీ, చింతల పరశురాములు, బొంగు నాగిరెడ్డి, కొంగరి గిరిధర్, తాళ్లపల్లి శ్రీనివాస్, పొతుగంటి కొమురవెల్లి, మహేశ్‌యాదవ్, తూముల రమేశ్‌యాదవ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు, కొమురవెల్లి సర్పంచ్ సార్ల లతాకిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, డైరెక్టర్ బత్తిని నర్సింహులుగౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొ న్నారు.