
కృషిచేస్తున్నారని, దీనికి గాను ఖర్చుకు వెనుకాడకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఉచితంగా పేదలకు అందజేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ కాలనీలో 350 మంది లబ్ధ్దిదారులచే డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రవేశాలు చేయించారు. పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల కోసం పెద్దఎత్తన ఇండ్లను నిర్మించి స్వయంగా గృహ ప్రవేశాలు చేయించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఇంతకంటే అనందం ఏముంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇండ్లు నిర్మించామని, కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
సిద్దిపేట, అక్టోబర్ 2: నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి అందజేస్తున్నామని, వారి కలను సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సాకారం చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్‌నగర్‌లో జడ్పీ చైర్పర్సన్ వేలేలి రోజారాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి 350 లబ్ధిదారులతో నూతన గృహ ప్రవేశాలు చేయించారు. డబుల్ బెడ్రూం ఇండ్లల్లో ఇంటింటికీ గ్యాస్‌ను టోరంటో గ్యాస్ ప్లాంట్‌ను ప్రారంభించి సైరాభాను అనే మహిళ ఇంట్లో గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ నగర్‌లోని జయశంకర్ కమ్యూనిటీహాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట నియోజకవర్గంలో పేదలకు పెద్దఎత్తున ఇండ్లను నిర్మించి స్వయంగా గృహ ప్రవేశాలు చేయించే అవకాశం కలుగడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఇంతకంటే ఆనందం ఏముందుటుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 3వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలతో గృహ ప్రవేశాలు చేయించామన్నారు. మరో 500 ఇండ్లు గృహ ప్రవేశాలకు రెండు నెలల్లో సిద్ధం చేస్తామని తెలిపారు. కేసీఆర్ నగర్లో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో రూ.163 కోట్లతో 2460 ఇండ్లు నిర్మించామని, ఇప్పటికే 1976 ఇండ్లకు గృహ ప్రవేశాలను చేయించామన్నారు. కేసీఆర్‌నగర్‌లో నివసించే వారు కాలనీని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
పైపుడ్ గ్యాస్ సరఫరా ఉన్న తొలి కాలనీ…
తెలంగాణలోనే ఇంటింటికీ పైపుడ్ గ్యాస్ కనెక్షన్ సరఫరా కలిగి ఉన్న ప్రభుత్వ నిర్మిత తొలి కాలనీ కేసీఆర్‌నగర్ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లాలో తన ఇంటికి, కలెక్టర్ ఇంటికి కూడా పైపుడ్ గ్యాస్ సరఫరా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడేండ్లలో 21 సార్లు పెట్రో, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తుందన్నారు. పైపుడ్ గ్యాస్‌తో రక్షణ, డబ్బులు ఆదా, సిలిండర్ కోసం ఎదురు చూసే బాధలుండవన్నారు. సీఎన్జీ వాహనాలకు ఇంధనం సమకూర్చే స్టేషన్‌ను సిద్దిపేటలో టోరంటో గ్యాస్ కంపెనీ ఏర్పాటు చేసిందన్నారు.
ఆడపడుచులకు బతుకమ్మ కానుక..
పండుగ పూట పేదలు కొత్త బట్టలతో పండుగ జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా అతిపెద్ద పండుగలు అన్నారు. ఆడపడుచులకు ఈసారి చూడచక్కని రంగులతో చీరలను అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 3 లక్షల 83వేల మందికి రెండు రోజుల్లో చీరెలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
గాంధీ జయంతివేడుకల్లో మంత్రి హరీశ్‌రావు
మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని కేసీఆర్‌నగర్‌లోని జయశంకర్ కమ్యూనిటీహాల్లో మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రాధాకృష్ణశర్మ, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి గాంధీజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.
సకల సౌకర్యాలతో కాలనీ నిర్మాణం