చాదర్ఘాట్ :కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పేదింటి యువతులకు వరం లాంటివని మలక్పేట్ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. బుధవారం నియోజకవర్గం పరిధిలోని సైదాబాద్, చార్మినార్ పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. షాదీ ముబారక్ చెక్కులు-43కు గాను రూ.43,04,988, కళ్యాణలక్ష్మీ చెక్కులు-28 గాను రూ.28,03,248 లను పంపిణీ చేశారు.