
గ్రామగ్రామాన గులాబీ జెండాను ఆవిష్కరిద్దాం
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు, ఆగస్టు 29: సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాన్ని గ్రామగ్రామాన, మున్సిపాలిటీల్లోనూ నిర్వహించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. జీఎమ్మార్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ పార్టీ సమావేశానికి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అజేయశక్తిగా మారిందన్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల పిలుపు మేరకు 55 గ్రామ పంచాయతీల్లో, 10 హామ్లెట్ గ్రామాల్లో, 3 మున్సిపాలిటీల్లో, 3 జీహెచ్ఎంసీ డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 2న నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 11గంటల మధ్య జెండాను ఎగురవేయాలని కోరారు. సెప్టెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు పార్టీ గ్రామ, మండల, మున్సిపల్, డివిజన్ కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ యువత జిల్లా అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, కొలన్బాల్రెడ్డి, చంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, నర్రా భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్‌కుమార్, ఎంపీపీలు ప్రవీణ విజయ్‌భాస్కర్‌రెడ్డి, సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్, మాజీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, పార్టీ మండలాల అధ్యక్షులు, సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.