
చిన్నశంకరంపేట,ఆగస్టు 18: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ సూచించారు. బుధవారం ఆయన చిన్నశంకరంపేటతో పాటు సంగాయపల్లిలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను, పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ నాటిన మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం మొక్కలను పరిరక్షించే వారిని డీఆర్డీవో శ్రీనివాస్ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, స ర్పంచ్ రాజిరెడ్డి, రమేశ్, ఎంపీవో గిరిధర్‌రెడ్డి, ఈజీఎస్ ఏపీవో వెంకటసా యి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
మెదక్‌రూరల్ ఆగస్టు 18: పచ్చదనం పెం పొందించడమే కోసమే ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని జిల్లా వ్యసా య అధికారి పరశురాంనాయక్ అన్నారు. మం డల పరిధిలోని రాజ్పల్లిలోని రైతువేదిక ఆవరణలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాంనాయక్, ఏఈ వో భార్గవి 200 మొక్కలు నాటారు. ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పంట పొలం వద్ద ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. జిల్లాలోని రైతు వైదికలో ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని ఏఈవోలకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ఎలక్షన్‌రెడ్డి పాల్గొన్నారు