
ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
కొల్చారం, సెప్టెంబర్ 16: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని ప్రాణాలు కాపాడుకోవాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. కొల్చారంలో గురువారం కొవిడ్ వ్యాక్సిన్ కా ర్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, ఎంపీడీవో ప్రవీణ్, మెడికల్ ఆఫీసర్ రమేశ్, జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల, సర్పంచ్ ఉమ, ఉప సర్పంచ్ చెన్న య్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, మాజీ అధ్యక్షుడు శేఖర్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ పాల్గొన్నారు.
కౌడిపల్లి,సెప్టెంబర్ 16 : కౌడిపల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రారంభించారు.కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్ , మెడికల్ ఆఫీసర్ వెంకట్యాదవ్లతో పాటు పలువురు పాల్గొన్నారు.
మనోహరాబాద్, సెప్టెంబర్ 16: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్‌ను వేసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలత కోరారు. మనోహరాబాద్‌లో ప్రారంభించిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్ ముదిరాజ్, ఎంపీపీ పురం నవనీతరవి, ఎంపీటీసీ లతావెంకట్, తూప్రాన్ పీహెచ్సీ వైద్యుడు ఆనంద్ పాల్గొన్నారు.
మనోహరాబాద్ మండలం పోతారంలో జరిగిన వ్యాక్సినేషన్ క్యాంపులో 300 మందికి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమాన్ని ఎంపీడీవో జైపాల్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేశ్వర్, సర్పంచ్ మాధవరెడ్డి, ఉప సర్పంచ్ వీరేశ్, నాయకులు రవి, ప్రభాకర్‌రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.
తూప్రాన్/రామాయంపేటలో మున్సిపల్ చైర్మన్లు
తూప్రాన్/రామాయంపేట, సెప్టెంబర్ 16: రామాయంపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నాలుగు కొవిడ్ కేంద్రాలను మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్ పరిశీలించారు. మండలంలోని కోనాపూర్, రాయలాపూర్, డీ.ధర్మారం, లక్ష్మాపూర్, అక్కన్నపేట, దామరచెర్వు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఎంపీపీ భిక్షపతి, ఎంపీవో గిరిజారాణిలు సందర్శించారు. తూప్రాన్ లోని మూడు కేంద్రాలను తూప్రాన్ ఆర్డీవో శ్యాం ప్రకాశ్, మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, కమిషనర్ మోహన్ సందర్శంచారు. మండలంలోని నాగులపల్లి, గుడ్రెడ్డిపల్లి, ఘనపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలను తూప్రాన్ ఎంపీడీవో అరుంధతి, ఎంపీవో రమేశ్ సందర్శించి పలు సూచనలు చేశారు.
8 సబ్ సెంటర్లలో 16 వందల మందికి
చేగుంట, సెప్టెంబర్16: చేగుంట, మక్కరాజిపేట్, చందాయిపేటతో పాటు మండలంలోని 8 సబ్ సెంటర్లలో 16 వందల మందికి కొవిడ్ వాక్సిన్ వేశారు. చేగుంటలో మండల సర్పంచ్ల పోరం అధ్యక్షుడు శ్రీనివాస్,ఎంపీటీసీ వెంకటలక్ష్మి, చందాయిపేటలో మండల ప్రత్యేక అధికారి జయరాజ్, ఎంపీడీవో ఉమాదేవి సబ్ సెంటర్లను పరిశీలించారు. మక్కరాజిపేటలో ట్రైనీ కలెక్టర్ అశ్వినీ గురువారం పరిశీలించారు. నార్సింగి ఆరోగ్యకేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని మండల ప్రత్యేక అధికారి జగదీశ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అశోక్, ఎంపీడీవో ఆనంద్‌మేరీ పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌లు స్వర్ణలత, కుమ్మరి శ్రీనివాస్, ఎంపీటీసీ కవిత, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు
నిజాంపేటలో…
నిజాంపేట,సెప్టెంబర్16: మండలంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఉపకేంద్రాల్లో వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. నిజాంపేటలోని ఆరోగ్య ఉపకేంద్రంలో 18 ఏండ్లు నిండిన వారికి ఏఎన్ఎం అనురాధ, సెకండ్ ఏఎన్ఎం బాలమణి కరోనా వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు లక్ష్మి, బాలమణి, గ్రామస్తులు ఉన్నారు.
చిలిపిచెడ్‌లో…
చిలిపిచెడ్,సెప్టెంబర్ 16:మండల కేంద్రంలో,చండూర్, చిట్కుల్, సోమక్కపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొవి డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిదని ఎంపీడీవో శశిప్రభ అన్నారు. గ్రామంలో పారిశుధ్య కార్మికులు, ప్రజలు , రైతులు టీకా తీసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీవో పోలేశ్వర్రాజు, కార్యదర్శి భాస్కర్, వైద్య సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, సెప్టెంబర్ 16: మండలంలోని మన్నెవారి జలాల్పూర్, మంగళపర్తి, మానేపల్లిలో ప్రత్యేక వ్యాక్సిన్ శిబిరాలను ఎంపీపీ స్వరూప, మండల ప్రత్యేక అధికారి స్వ ప్న , ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఎంపీవో తిరుపతిరెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు వెంకటలక్ష్మి, రామకృష్ణారా వు, ఎంపీటీసీ భాస్కర్‌గౌడ్, నాయకులు కృష్ణ, లక్ష్మణ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో..
నర్సాపూర్,సెప్టెంబర్16: మండల పరిధిలోని రెడ్డిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టారు. నాలుగు కేంద్రాల్లో1424 మందికి వ్యాక్సిన్ వేశామని తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి..
మనోహరాబాద్, సెప్టెంబర్ 16 : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలత అన్నారు. మనోహరాబాద్ మండలం దండుపల్లిలో మహిళా గ్రూపు, శ్రీనిధి, సెర్ఫ్ తరుఫున మంజూరైన నిధులతో ఏర్పాటు చేసిన బట్టల దుకాణాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. శ్రీనిధి, సెర్ఫ్ సంయుక్తంగా మహిళా సంఘాల సభ్యులకు రూ. లక్ష నుంచి పది లక్షల వరకు నిధులు మంజూరు చేయిస్తున్నారన్నారు. నిధులతో మహిళలు ఆర్థికంగా ఎదుగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి, మరికొంత మందికి ఉపాధి కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పురం మహేశ్వర్, ఎంపీపీ నవనీతరవి, ఎంపీటీసీ లతావెంకట్, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, సర్పంచ్ లక్ష్మి, నాయకులు భిక్షపతి, శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.