పూజలు చేసిన మండలి ప్రొటెం
చైర్మన్ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు, అక్టోబర్ 10: పటాన్చెరు మండలం పెద్దకంజర్లలో ఆదివారం దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. ప్రత్యేక పూజల్లో శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి పాల్గొని వేదపండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. దసరా పండుగ సందర్భంగా అన్ని దేవాలయాలు, మండపాల వద్ద భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పెద్దకంజర్లలో దసరా నవరాత్రి వేడుకలను చక్కగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ రాజ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
రామేశ్వరంబండలో పూజలు చేసిన ఎమ్మెల్యే
పటాన్చెరు మండలం రామేశ్వరంబండలోని జీహెచ్ఎంసీ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సందర్శించారు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అంతిరెడ్డి పాల్గొన్నారు.
దుర్గామాత పూజల్లో పాల్గొన్న కాట శ్రీనివాస్‌గౌడ్
పటాన్చెరు మండలం పెద్దకంజర్లలో దుర్గాదేవి విగ్ర హ ప్రతిష్ఠాపనలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. పటాన్చెరు పట్టణంలో నవరాత్రి వేడుకల్లో పూజలు చేశారు. కాంగ్రెస్ నేతలు రాధాకృష్ణ, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నరసింహ, చిన్నముదిరాజ్, శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు.