మనోహరాబాద్, అక్టోబర్ 10 : శివ్వంపేట మండలం పిల్లుట్లలో భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళాకమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మె ల్యే మదన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడు, జడ్పీటీసీ మహేశ్‌గుప్తా, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, సర్పంచ్‌లు రవి, చంద్రకళ, భవానీ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు
కొల్చారంలో..
కొల్చారం,అక్టోబర్10: మండల పరిధిలోని రంగంపేటలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల, సర్పంచ్ సుజాత, ఎంపీటీసీ మాధవి, పాల్గొన్నారు.
కౌడిపల్లిలో..
కౌడిపల్లి,అక్టోబర్ 10: మండల పరిధిలోని పీర్ల తండాలో జగదాంబ మాత ఆలయం తండావాసులు నూతంగా నిర్మించారు. తండాలో జగదాంబ దేవి విగ్రహా ప్రతిష్ఠ మ హోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి హాజరై జగదాంబదేవి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం లో ఎంపీపీ రాజునాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామాగౌడ్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, నాయకులు పాల్గొన్నారు.
నిజాంపేటలో..
నిజాంపేట,అక్టోబర్10: మండల వ్యాప్తంగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నస్కల్లో దుర్గ భవానీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత ను ఎంపీపీ సిద్ధిరాములు,నిజాంపేటలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిష్ఠించిన దుర్గమాతను టీఆర్ఎస్ యూ త్ మండల అధ్యక్షుడు రాజు,గ్రామ అధ్యక్షుడు నాగరాజు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమం లో నిజాంపేట పీఏసీఎస్ డైరెక్టర్ స్వామిగౌడ్, టీఆర్ఎస్ గ్రామ యూత్ ఉపాధ్యక్షుడు నగేశ్,యూత్ సభ్యులు శివ, నరేశ్, స్వామి, ప్రసాద్, రాజు ఉన్నారు.
రామాయంపేటలో..
రామాయంపేట, అక్టోబర్ 10: రామాయంపేట పట్టణంలోని మహంకాళి ఆలయంలో అమ్మవారు ఆదివారం కూష్మాండ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకొని పూజా కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో మహంకాళి ఆలయ సిబ్బంది శ్యాంరాజు, సత్యం, యాదగిరి, నరేశ్ ఉన్నారు.
తూప్రాన్ పట్టణంలోని దేవి గార్డెన్లో దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవికి ప్రత్యే క పూజలు చేశారు. దుర్గా మాతా భక్తులకు అన్నపూర్ణాదేవీగా దర్శనం ఇచ్చింది.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, ఆక్టోబర్ 10: విజయదశమిని పురస్కరించుకొని వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా వెల్దుర్తి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దుర్గాభవానీ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారు నాలుగో రోజు ఆదివారం గాయత్రీదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.