
కంగ్టి, ఆగస్టు 9 : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న కంగ్టి సిద్దేశ్వరాలయంలో శ్రావణమాసం సోమవారం పురస్కరించుకుని భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు, అన్నపూజ, ఆకు పూజ నిర్వహించారు.
గుమ్మడిదల, ఆగస్టు9: శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. గుమ్మడిదలలో కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు కేవీ.నర్సింహాచార్యులు, కేవీ.రంగనాథచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమలో ఆలయకమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
బొల్లారం, ఆగస్టు 9: శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి శివాలయంలో లింగానికి అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు నాగార్జునచార్యుల ఆధ్వర్యంలో శాస్ర్తోక్తంగా కుంకుమార్చనలు, కర్పూర హారతులతో మంగళ నీరాజనాలు సమర్పించారు.
నారాయణఖేడ్, ఆగస్టు 9 : నారాయణఖేడ్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. పంచవటి క్షేత్రంగా పేరొందిన పంచగామ గ్రామంలోని నాగలింగేశ్వర ఆలయం, పట్టణంలోని కాశీవిశ్వనాథస్వామి ఆలయం, నగిరేశ్వర మందిర్, రామాలయం, కొండాపూర్ ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంగల్‌పేట్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో నవనాథ పారాయణం ప్రారంభించారు.
న్యాల్కల్, ఆగస్టు 9 : హద్నూర్ సంగమేశ్వరస్వామి ఆల యంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ వీరమణి, రాజుకుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్ర త్యేక పూజా కార్యక్రమంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంస్ చైర్మన్ శివకుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్ ఉన్నారు.
రాయికోడ్,ఆగస్టు 9 : శ్రావణ మాసం ప్రారంభం కావడంతో రాయికోడ్ శ్రీవీరభద్రేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవీరభద్రేశ్వరస్వామి, భద్రకాళి అమ్మవార్లకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు. ఆలయ పూజరులు వీరేశంస్వామి, శివకుమార్‌స్వామి, మల్లిఖార్జున్స్వామి, బస్వరాజుస్వామి, రుద్రయ్యస్వాములతో పాటు దేవాదాయ శాఖ సిబ్బంది కృష్ణ, శివస్వామి, రంగనాథ్ ఉన్నారు.
కోహీర్, ఆగస్టు 9: బడంపేట రాచన్నస్వామి దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించిన స్వామివారికి లక్ష బిల్వార్చన కనుల పండుగలా నిర్వహించారు. శివుడి పేరున ఉన్న సహస్ర నామాలను జపిస్తూ త్రిదళ పత్రాలను (మారెడు) సమర్పించారు. వేడుకల్లో ఆలయ కమిటీ చైర్మన్ మడపతి రాజు, ఈవో శివరుద్రప్ప, జగదీశ్వర్‌స్వామి, శివమూర్తిస్వామి, శివానంద్ పాల్గొన్నారు.