సంగారెడ్డి మున్సిపాలిటీ, అక్టోబర్ 2 : స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రక్రియ సంగారెడ్డి జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 8,00,074 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. హెల్త్‌కేర్ వర్కర్లు 7,572 మంది మొదటి డోస్ తీసుకోగా, 5,838 మంది రెండో డోస్ తీసుకున్నారు. అలాగే, ఫ్రంట్ లైన్‌వర్కర్లు 10,895 మంది మొదటి డోస్ తీసుకోగా, 5,617 మంది రెండో డోస్ తీసుకున్నారు. 60 ఏండ్ల వయస్సు పైబడిన వారు 46,654 మంది మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోగా, 26,440 మంది రెండో డోస్ తీసుకున్నారు. 45 ఏండ్ల వయస్సు నుంచి 59 సంవత్సరాల వయస్సు వరకు 2,13,732 మంది మొదటి డోస్ తీసుకోగా, 84,202 మంది రెండో డోస్ తీసుకున్నారు. 18 సంవత్సరాల వయ స్సు నుంచి 44 సంవత్సరాల వయస్సు వారు 3,14,187 మొదటి డోస్ తీసుకోగా, 85,137 మంది రెండో డోస్ తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 5,92,840 మంది మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే, రెండో డోస్ 2,07,234 మం ది తీసుకున్నారు. జిల్లాలో 3.68 లక్షల జనాభా ఉండగా, 3,34,112 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. అర్బన్ ఏరియాల్లో 90.79 శాతం వ్యాక్సిన్ తీసుకున్నారు. రూరల్ ఏరియాల్లో 10.33లక్షల జనాభా ఉండగా, 4,65,962 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 8,00,074 మంది వ్యాక్సిన్ తీయించుకున్నారు. జిల్లాలో 6,81,735 మంది కొవిషీల్ట్ వ్యాక్సిన్ తీసుకోగా, 1,18,339 మంది కొవాగ్జిన్ తీసుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీయించుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని సూచిస్తున్నారు.
జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యం
కరోనా నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకు 8,00,074 మందికి వ్యాక్సిన్ అందించాం. ఇందులో మొదటి డోస్ 5,92,840, రెండో డోస్ 2,07,234 మందికి వ్యాక్సిన్ వేశాం. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని పీహెచ్సీ సబ్ సెంటర్లలో ప్రజలకు వ్యాక్సిన్ అందించే ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో 100 శాతం వ్యాక్సిన్ వేయించడమే లక్ష్యంగా పనిచేస్తు న్నాం. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని కరోనా నుంచి రక్షణ పొందాలి.
-గాయత్రీదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, సంగారెడ్డి