
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
గుమ్మడిదల, సెప్టెంబర్ 2: జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వీరన్నగూడెంలోని బొంతపల్లి వీరభద్రస్వామి ధర్మకర్తల మండలి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీ కుమార్‌గౌడ్, దేవాదాయధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాగరాజు, ఇన్స్పెక్టర్ రమణ, ఈవో శశిధర్‌గుప్తా సమక్షంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం చేసింది. చైర్మన్‌గా బొంతపల్లి గ్రామానికి చెందిన గటాటి భద్రప్పను రెండోసారి ధర్మకర్తల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే బొంతపల్లి వీరభద్రస్వామి అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు. చైర్మన్ గటాటి భద్రప్ప హయాంలో మూడు రాజగోపురాలు, ప్రాకారం, సాలారం రూపుదిద్దుకుంటున్నాయని అభినందించారు. పారిశ్రామికవేత్తల సహాయం, భక్తుల విరాళాలతో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, మమతావేణు, రాజశేఖర్, కొరివి ఆంజనేయులు, ఉపసర్పంచ్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్ గౌరీశంకర్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు సద్ది విజయభాస్కర్‌రెడ్డి, నక్క వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.