పటాన్చెరు, సెప్టెంబర్ 30 : సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, రేపటి తరాన్ని తయారు చేసేది గురువేనని శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సౌజన్యంతో నియోజకవర్గ స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొటెమ్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులను వారు సన్మానించారు. ప్రొటెమ్ చైర్మన్ మాట్లాడారు. ముందుగా ఉపాధ్యాయులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు తాను శాసనమండలి ప్రొటెమ్ చైర్మన్‌గా ఉన్నానంటే చిన్నప్పుడు తనకు గురువులు చేసిన అక్షరాభ్యాసంతోనే అన్నారు. తన సొంత నిధులు ఖర్చు చేసి 20 తరగతి గదులతో ఇంటర్ కళాశాలను కట్టించినట్టు తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు విద్యకు పెద్దపీట వేస్తున్నదన్నారు. ఉపాధ్యాయులు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, రోజా, ఎంపీపీలు సుష్మశ్రీ, సద్ధి ప్రవీణ రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజ రెడ్డి, కార్పొరేటర్లు సింధూ రెడ్డి, పుష్ప యాదవ్, మెట్టు కుమార్ యాదవ్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, ఎంపీటీసీలు గోల్కొండ నాగజ్యోతి, ఎంపీడీవో బన్సీలాల్, ఎంఈవో పీపీ రాథోడ్, పరమేశ్, రవీందర్ పాల్గొన్నారు.