ఆటోమొబైల్ హబ్‌గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. దీనికి గాను పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ 2012లో దేశంలోనే అతిపెద్ద ట్రాక్టర్ల ఉత్పత్తి కర్మాగారాన్ని జహీరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌లో గతేడాది నవంబర్‌లో జపాన్‌కు చెందిన మిత్సుబిషితో కలిపి కే2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ ప్లాంట్‌ని ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి 37 రకాల ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తూ దేశవిదేశాలకు ఎగుమతి చేస్తున్నది. బుచినెల్లి శివారులో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. తద్వారా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
-జహీరాబాద్, సెప్టెంబర్ 30జహీరాబాద్, సెప్టెంబర్ 30 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ను ఆటోమొబైల్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. దీనికి గాను పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తున్నది. రాష్ట్రంలో మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమ సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో ఉంది. మహీంద్రా ట్రాక్టర్ల కర్మాగారంలో కొత్తగా ప్రభుత్వ ప్రోత్సాహంతో 20 అశ్విక శక్తి (హెచ్‌పీ) సామర్థ్యంతో పనిచేసే తేలికపాటి కే2 సిరీస్ ట్రాక్టర్ల ఉత్పత్తిని జహీరాబాద్ యూనిట్లో సంస్థ ప్రారంభించింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ వ్యవసాయ యంత్ర విభాగం చైర్మన్ హేమంత్ సిక్కా ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే ట్రాక్టర్లును ఇటీవల పరిశీలించి అభినందించారు. జహీరాబాద్‌లో ఉత్పత్తి చేసిన కే2 సిరీస్ ట్రాక్టర్ల్లను త్వరలో మార్కెట్లో విడుదల చేస్తామని పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది.
రూ.100 కోట్లతో మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్ విస్తరణ
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ 2012లో దేశంలోనే అతిపెద్ద ట్రాక్టర్ల ఉత్పత్తి కర్మాగారాన్ని జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసింది. జహీరాబాద్ ట్రాక్టరు ప్లాంట్‌లో ప్రతి ఏడాది లక్ష ట్రాక్టర్లు ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మకాలు చేసేందుకు సంస్థ ప్రయత్నం చేస్తున్నది. ప్రపంచలోనే మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్ అత్యధిక వాహనాలు ఉత్పత్తి చేసేదిగా గుర్తిం పు పొందింది. మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్‌లో గతేడాది నవంబర్‌లో జపాన్‌కు చెందిన మిత్సుబిషితో కలిపి కే2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ ప్లాంట్‌ని ఏర్పాటు చేశారు. ట్రాక్టర్లు ఉత్పత్తి చేసేందుకు రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టింది. ట్రాక్టరు ప్లాంట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి 1500 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మహీంద్రా యాజమాన్యం పది నెలల్లోనే ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి 37 రకాల ట్రాక్టర్లు ఉత్పత్తిని ప్రారంభించింది. జహీరాబాద్ మహీంద్రా ట్రాక్టర్లు ప్లాంట్‌లో తయారీ చేసే వాటిని అమెరికా, దక్షిణ, తూర్పు ఆసి యా, జపాన్ దేశాలకు ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెలలో కే2 ట్రాక్టర్ ఆవిష్కరణకు యత్నాలు
జహీరాబాద్ మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే కే2 ట్రాక్టర్లను ఈనెలలో సీఎం కేసీఆర్‌చే ఆవిష్కరించేందుకు ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తున్నదని అధికారుల ద్వారా తెలిసింది. జహీరాబాద్ ట్రాక్టరు ప్లాంట్‌కు సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించి కే2 ట్రాక్టరు ఆవిష్కరించేందుకు సంస్థ ప్రయత్నం చేస్తున్నదని సమాచారం.
ఆటోమొబైల్ హబ్‌గా మార్చేందుకు ..
జహీరాబాద్‌ను ఆటోమొబైల్ హబ్‌గా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ మినీ వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు ఉత్పత్తి చేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నది. జహీరాబాద్ ప్లాంట్‌కు అనుబంధనంగా బుచినెల్లి శివారులో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి పారిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మహీంద్రాలో ఉత్పత్తి చేసే వాహనాలకు అవసరమైన పరికరాలు ఇక్కడ తయారీ చేస్తారు. దీంతో వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.