శంషాబాద్: సామాజిక సేవారంగంలో తమ వంతు సహాయసహకారాలు అందిస్తూ విపత్కర పరిస్థితులలో ఆపన్న హస్తం అందిస్తున్న శంషాబాద్ లిమ్స్ ఆసుపత్రి యాజమాన్యాన్ని సైబరాబాద్ సీపి సజ్జనార్ సత్కరించారు. ఈ మేరకు సోమవారం నగరంలోని సైబరాబాద్ కమీషనరేట్ లో జరిగిన కార్యక్రమంలో సజ్జనార్ చేతుల మీదుగా సన్మానంతో పాటు ప్రశంసాపత్రాన్ని ఆసుపత్రి వ్యవస్థాపకులు డా. రాంరాజ్ అందుకున్నారు.
లిమ్స్ హస్పటల్ యాజమాన్యం అండ్ టీం కు వరుసగా 2 వ సారి ఘనంగా సత్కారం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ శంషాబాద్ లిమ్స్ హాస్పటల్ యాజమాన్యం సేవలు అభినందనీయమని ప్రశంసించారు. పేద, మధ్య తరగతి చెందిన వారికి కోవిడ్, రోడ్డు యాక్సిడెంట్ లు, అత్యవసర సేవలను ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు తమ ఔదార్యాన్ని చాటుకుంటూ సమాజసేవలో ముందున్నారన్నారు.
మిగతా కార్పోరేట్ హాస్పటల్స్ లిమ్స్ సేవాతత్పరతను స్ఫూర్తిగా తీసుకొని తాము భాగస్వాములు కావాలని కోరారు. లిమ్స్ రాబోయే రోజుల్లో మరిన్ని సేవలతో మెరుగైన ఆరోగ్యకర సేవలకు తోడ్పడాలని పేర్కొన్నారు.