నిర్మల్ టౌన్, జనవరి 13 : జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ఈనెల 18న జిల్లా కేంద్రంలో రూ. 31 కోట్లతో 250 పడకల మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని దివ్యగార్డెన్‌లో నిర్మల్ నియోజకవర్గంలోని 221 మందికి గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నిర్మల్‌ను జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటైతే ఈ ప్రాంతంలో వైద్య సదుపాయం మరింత మెరుగుపడుతుందన్నారు. మైనార్టీల సంక్షేమానికి రూ.20 కోట్లతో చించోలి (బీ) వద్ద గురుకుల పాఠశాలను ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎంపీపీలు కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ ప్రభాకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్‌ఖాన్, టీఆర్ఎస్ నాయకులు అడ్వాల రమేశ్, రవీందర్‌రెడ్డి, రాజ్‌మహ్మద్, చందు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్‌రావు, తదితరులున్నారు.
దేవరకోట ఆలయంలో పూజలు
నిర్మల్ అర్బన్, జనవరి 13 : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ కుటుం బ సభ్యులతో దేవరకోట లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని చెప్పా రు. రాష్ట్ర ప్రజలలకు వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపా రు. కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ప్రముఖ వ్యాపార వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, ఆలయ చైర్మన్ లక్ష్మీనర్సయ్య, కత్తి సుధాకర్, రంగు రవి కిషన్, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.
సారంగాపూర్, జనవరి 13: బండరేవు తండా లో నిర్వ హిస్తున్న నానుమహారాజ్ జాతరకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజర య్యారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్భం గా కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులను మంత్రి అభినందిం చారు. విజేతలకు మంత్రి సోదరుడు ముర ళీధర్రెడ్డి బహుమ
రైతు వ్యతిరేకి ప్రధాని మోడీ..
నిర్మల్ టౌన్, జనవరి 13:వ్యవ సాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతు న్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆరోపించారు. నిర్మల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎరువుల ధరలు పెంచి, రైతాంగాన్ని దగా చేస్తున్న ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ రాసిన లేఖకు దమ్ముంటే జవాబివ్వాలని సవాల్ విసిరారు. దేశ వ్యాప్తంగా రైతులకు ఏడేళ్లలో బీజేపీ ఒక్క మంచి పనీ చేయలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, దాన్ని జీర్ణించుకోలేక బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు మూడు చట్టాలను తెచ్చి, ప్రస్తుతం ఎన్నికల భయంతో వెనక్కి తీసుకుందని విమర్శించారు. వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తామని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ఎదురుగాలి ప్రారంభమైందని, వచ్చే ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కేరళ, బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్‌తో భేటీ అయ్యారని గుర్తు చేశారు. రైతులతో కలిసి నాగలి ఎత్తి బీజేపీని గోతిలో పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.