Mother dairy | పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహం.. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.. పాలసెంటర్ల చైర్మన్ల ఆందోళన

హయత్‌నగర్ : మదర్ డెయిరీ పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని సంస్థ పాల సెంటర్ల చైర్మన్లు డిమాండ్ చేశారు. గురువారం హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ ఎదుట ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని పాల సెంటర్ల చైర్మన్లు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం కానుకగా పాడి రైతులకు లీటర్‌కు రూ.5 పెంచాలని డిమాండ్ చేశారు. రాజపేట, భువనగిరి చిల్లింగ్ స్టేషన్లలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించాలని, సూర్యపేట చిల్లింగ్ స్టేషన్ చెకింగ్ చేయడానికి వెళ్లిన రైతులపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులను రద్దు చేయాలని అన్నారు.
పరిగి, మల్లెపల్లి దుకాణాలపై పాత టెండర్ రద్దు చేసి నూతన టెండర్‌ను అమలు చేయాలని పేర్కొన్నారు. సిబ్బందికి వేతనాలు పెంచి పాడి రైతులకు ధర పెంచకపోవడం ఏమిటని ప్రశ్నించారు. 2020 నుంచి సిబ్బందిని పరిగణనలోకి తీసుకుని ప్రైవేట్ మార్కెటింగ్ చేస్తున్న వారిని తొలగించాలని, 159వ బోర్డు సమావేశంలో పెట్టిన ప్రమోషన్లను వెంటనే నిలపివేయాలని డిమాండ్ చేశారు.
మదర్ డెయిరీ ముందున్న పార్లర్లను సంస్థ సిబ్బందితోనే నడిపించాలని కోరారు. అనంతరం మదర్ డెయిరీ సంస్థ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల సెంటర్ల చైర్మన్లు వెంకట్ నర్సింహారెడ్డి, పావని, సోమయ్య, క్రిష్ణ, రాంరెడ్డి, మహేందర్‌రెడ్డి, పీర్ల ఐలయ్య, భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

