
ధన్వాడ, జనవరి 14: స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ధన్వాడ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుపై వెంటనే బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. సమస్యలు సష్టించే వారిపై ప్రత్యేక దష్టి సారించాలని కోరారు. ఒమిక్రాన్ వైరస్‌పై అప్రమత్తంగా ఉండలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్ పరంగా పోలీస్ సిబ్బందికి పలు సూచనలు, సలహలు అందించారు. అనంతరం స్టేషన్లో మొక్కలు నాటారు. ఎస్పీ వెంట మరికల్ సీఐ శివకుమార్, ఎస్ఐ రమేశ్, సిబ్బంది ఉన్నారు.
పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
మాగనూర్ జనవరి 14: మాగనూర్ మండల కేంద్రంలోని రక్షకభట నిలయాన్ని ఆకస్మికంగా నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్‌కు వచ్చే బాధితులకు పూర్తి భరోసా, ధైర్యాన్నిచ్చేలా పోలీస్ విచారణ నిర్వహించాలని , ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలన్నారు. సమస్యలను సృష్టించే వారిపై ప్రత్యేకదృష్టి పెట్టి అవసరమైతే రౌడీషీట్స్ తెరవాలన్నారు. గుడుంబా, గుట్కా, గంజాయి లాంటి నిషేదిత ప దార్థాల అమ్మకాలు, అక్రమ రవాణను నిరోధించడం, అక్రమ వ్యాపారాలు చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా,ఒమిక్రాన్ వంటి వైరస్‌లపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించాలి. దొంగతనాల నివారణ కోసం నేను సైతం కమ్యూనిటీ పోలీసింగ్‌లో బాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీస్ స్టేషన్ ఆవరణను వారానికి ఒకసారి శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్సై శివనాగేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.