బడంగ్‌పేట : దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను మీర్‌పేట పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో నివాసముంటున్న జర్పటి నర్సింహ్మ(39) పాత నేరస్తుడు. పేయింటింగ్ పని చేస్తుంటాడు. చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు.
ఆదాయం అతని అవసరాలకు సరిపోకపోవడంతో తాళం వేసిన ఇండ్లలో, షాపులలో దొంగతనాలకు పాల్పడ్డాడు. గతంలో వనస్థలిపురం, ఎల్భీనగర్, మీర్‌పేట, శంషాబాద్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో 15 దొంగతనాల కేసులో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.
ఈ నెల 16న మీర్‌పేట చంద్రనగర్ కాలనీలో గోడకు రంద్రం చేసి షాపులో ఉన్న 22 వేలు, రెండు జతల వెండి పట్టగొలుసులు చోరీ చేశాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
23న అర్థరాత్రి అతడు ఇంట్లో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 64 తులాల వెండి ఆభరణాలు, రూ. 530 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగను రిమాండ్‌కు తరలించారు.