షాద్‌నగర్‌రూరల్, సెప్ట్టెంబర్ 29 : పంచాయతీరాజ్, స్థానిక సంస్థల బాధ్యులకు గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.13 వేలకు చేరింది. ఎంపీటీసీ, సర్పంచ్ల గౌరవ వేతనం రూ.5000 నుంచి రూ.6,500లకు పెరిగింది. పెంచిన వేతనాలు జూన్ నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా కరోనా ప్రభావం ఉన్నా.. ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధుల్లో కోత విధించకుండా విడుదల చేయనున్నది. ఫరూఖ్‌నగర్ మండలంలో మొత్తం 47 మంది సర్పంచ్‌లు,17 మంది ఎంపీటీసీలు, కో-అప్షన్ సభ్యులు, ఎంపీపీ, జడ్పీటీసీలు ఉన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ ఖాజాఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
గౌరవ వేతనం పెంచడం సంతోషం
వివిధ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధుల్లో ప్రతి పైసా వృథా కాకుండా చూస్తాం. ప్రభుత్వం గౌరవ వేతనాలు పెంచడం సంతోషం. సీఎం కేసీఆర్సారుకు రుణపడి ఉంటాం.
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
మండలంలోని గ్రామాలను అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తాం. ఎంపీపీ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. గౌరవ వేతనాలు పెంచడం హర్షించదగ్గ విషయం.
రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం
ప్రభుత్వ ఫథకాలను అర్హులైన వారందరికీ అందే లా కృషిచేస్తాం. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామస్తుల ను భాగస్వాములను చేశాం. నేడు గ్రామంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. గౌరవవేతనం పెంచడంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం.
-జయశ్రీచంద్రశేఖర్, విఠ్యల సర్పంచ్
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
ప్రభుత్వం సర్పంచ్, ఎంపీ టీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ లకు గౌరవ వేతనాలు పెంచడం చాలా సంతోషం. సర్పంచ్‌లు మరింత బాధ్యతగా పనిచేస్తారు. తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం హర్షణీయం. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది.
-బద్దులశ్రీశైలం, సర్పంచ్,కిషన్‌నగర్