కడ్తాల్, ఆగస్టు 25 : కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, జిల్లాల్లోనే అగ్రభాగాన నిలబెడతానని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, గంప శ్రీను పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తల్లి మంగమ్మతో కలిసి కేక్‌కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో త్వరలో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందజేస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన కడ్తాల్ మండలాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పరమేశ్, మండల కోఆర్డినేటర్ వీరయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షురాలు వాణిశ్రీ, పట్టణ అధ్యక్షుడు జహంగీర్‌అలీ, సర్పంచ్‌లు హరిచంద్‌నాయక్, కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, రవీందర్‌రెడ్డి, సులోచన, భాగ్యమ్మ, యాదయ్య, భారతమ్మ, నాగమణి, పూజానాయక్, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, మంజుల, ప్రియ, ఉప సర్పంచ్‌లు వినోద్, అనిల్‌యాదవ్, నాయకులు చందోజీ, లాయక్‌అలీ, రాజేందర్‌యాదవ్, నర్సింహ, లక్పతినాయక్, సేవ్యానాయక్, గోపాల్, రాఘవరెడ్డి, మహేశ్, సాయిలు, చంద్రమౌళి, రాఘవాచారి, నరేశ్‌యాదవ్, ఇర్షాద్, జంగయ్యగౌడ్, సాయికుమార్, వెంకటయ్య, నరేశ్, అంజి, శ్రీనివాస్, శ్రీకాంత్, చందు, బాబా పాల్గొన్నారు.