గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రూ.1.30 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయన్నారు. 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు రూ.6500 కోట్ల నిధులు గ్రామాలకు మంజూరు చేశారన్నారు. దళితులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 18 : గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ రాష్ట్రం అడు గులు వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. బుధవారం రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆమె ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నాగారం గ్రామంలో అంగ న్వాడీ భవనం, ఏనుగుచెర్వుతండా, తీగలకుంట తండా, పడమటితండా, దిల్వార్గూడ గ్రామ పం చాయతీల్లో సీసీరోడ్లు, భూగర్భడ్రైనేజీ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లో గడిచిన ఆరునెలల్లో 2604రైతు వేదికలు నిర్మించినట్లు తెలిపారు. రైతు బీమా ద్వారా రైతు లకు ఏడాదికి పన్నెండువందల కోట్లు ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తున్నదన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ఏడాదికి పదివేల కోట్లు ఖర్చుచేస్తున్నదన్నారు. రాష్ట్రంలో 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ఆరువేల ఐదు వందల కోట్ల నిధులు గ్రామాలకు నేరుగా ప్రభు త్వం మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో 116కోట్ల వ్యయంతో 19,478 పల్లె ప్రకృతి వనాలు, 1554 కోట్లతో 12,728గ్రామాల్లో వైకుంఠధామాలు , 319కోట్లతో 12,776 డంపింగ్ యార్డుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని రజకులకు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన గొల్ల, కురుమ సోదరులందరికీ గొర్రెల పంపిణీ మత్స్యకారులకు చేప పిల్లలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నదన్నారు. దళిత బంధు పథకాన్ని ప్రతిపక్షాలు పక్కతోవ పట్టిం చడానికి ప్రయత్నం చేస్తున్నాయన్నారు. పథకం అమలు అయితే తమ ఉనికి ఉండదన్న భయం తో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఆరు నూరైనా దళితబంధు పథకం ద్వారా దళితులకు తగిన న్యాయం చేస్తామన్నారు.