షాద్‌నగర్ / కొత్తూరు ఆగస్టు18: కొత్తూరు నుంచి షాద్‌నగర్ బైపాస్ రోడ్డు వరకు ఉన్న పాత జాతీయ రహదారిని ఆధునీకరిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 67.75 కోట్ల నిధులను మంజూరు చేసింది. కొత్తూరు మండల కేంద్రం నుంచి నందిగామ మండల కేంద్రం మీదుగా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ బైపాస్ రోడ్డు వరకు రహదారిని నాలుగు వరుసల దారిగా అభివృద్ధి చేయనున్నారు. దారి పొడవునా డివైడర్‌ను నిర్మిస్తారు. రోడ్డు మధ్య లో నుంచి 50 ఫీట్ల వెడల్పుతో ఇరు వైపులా రోడ్డు నిర్మాణం చేపట్ట నున్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలో నాలుగు వరుసల రహ దారి తో పాటు అదనంగా రెండు సర్వీస్ రోడ్లను నిర్మిస్తారు. దీంతో షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఆరు వరుసల దారి అందుబాటు లోకి రానున్నది. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటుచేస్తారు. దారి పొడవునా ఐదు వంతె నలు, 15 కల్వర్టులు, 9 బాక్స్ కల్వర్టులను నిర్మిస్తారు. మొదటగా వంతెనలు, కల్వర్టుల నిర్మాణాలను పూర్తిచేసిన అనంతరం రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి ఏడాది లోపు రహదారిని ఆందు బాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మూ డేండ్ల క్రితం మంత్రి కేటీఆర్ షాద్‌నగర్ పర్యటన సందర్భంగా కొత్తూ రు-షాద్‌నగర్ పాత జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా మారుస్తా మని హామీ ఇచ్చారు. ఈ నేప థ్యంలో గతనెలలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ లింగారెడ్డిగూడ వద్ద పనులు ప్రారంభిం చారు. అయితే హైవే 44 విస్త రణలో భాగంగా కొత్తూరు-అన్నారం బైపాస్ రోడ్డు వేశారు. దీంతో కొత్తూరు-షాద్ నగర్ పాత జాతీయ రహదారి గుం తల మయంగా మారి షాద్‌నగర్ రావడా నికే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో మంత్రి రోడ్ల విస్తరణకు పచ్చ జెండా ఊ పారు. టెండర్, రోడ్ల వెంబడి ఉన్న చెట్లు, అటవీ శాఖ అనుమతు ల వల్ల రోడ్డు పనులకు కొంత ఆలస్యం జరిగింది.
కొత్తూరు వై జంక్షన్ నుంచి సోలీపూర్ రోడ్డు వరకు 17 కి.మీ నాలు గు లేన్ల రోడ్డును రూ. 67 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ 17 కిలో మీటర్ల నాలుగు లేన్ల రోడ్డుతో పాటు బటర్ ఫ్లై లైట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే మొత్తం ఈ రోడ్డు 150 ఫీట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు మధ్య నుంచి రెండు వైపులా 75 ఫీట్ల రోడ్డుకు అర్అండ్బీ అధికారులు కొలతలు తీసుకుంటున్నారు. అయితే ఇందులో 50 ఫీట్ల రోడ్డు నిర్మించనున్నారు. మిగతా రెండు వైపులా కలిసి 100 ఫీట్లను భవిష్యత్ అవసరాల కోసం వినియో గించుకోనున్నారు. 100 ఫీట్లలో మురుగు కాలువలు, ఎలక్ట్రికల్ పోల్స్, మిషన్ భగీరీథ వాటర్ పైప్‌లైన్ తదితర అవసరాల కోసం ఈ స్థలాన్ని వాడనున్నారు. 17 కిలోమీటర్ల రోడ్డులో మొత్తం 5 బ్రిడ్జిలు,12 కల్వర్టులు 8 స్లాబ్ కల్వర్టులు నిర్మించనున్నారు.
పాత జాతీయ రహదారిని నాలుగులేన్ల రోడ్డుగా మార్చడంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. షాద్‌నగర్ నియోజకర్గం భవిష్యత్ అవసరాలు తీరాలంటే ఈ రోడ్డును నా లుగు లేన్ల రోడ్డుగా మార్చాలని ఎమ్మెల్యే సంకల్పించారు. అందు కోసం మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసి రోడ్డును సాధించుకున్నారు. గత నెలలో ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
పాత జాతీయ రహదారిని నాలుగు లేన్ల రోడ్డుగా మార్చడంతో కొత్తూరు, నంది గామ, షాద్‌నగర్ పట్టణాలకు మహర్దశ రానుంది. ముఖ్యంగా ఈ పాత జాతీయ రహదరి ఇరుగ్గా ఉంటడం, గుంతల మయంగా మారడంతో హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వెళ్లే ఆర్టీసీ బస్సులు షాద్‌నగర్‌కు రావడం లేదు దీంతో ప్రయాణికులు షాద్న గర్ డిపో బస్సుల పైనే ఆధారపడుతున్నారు. అలాగే జడ్చర్ల నుంచి షాద్‌నగర్ రావాలంటే ఇక గంటల కొద్దీ నిరీక్షించాల్సిందే. నాలుగు లేన్ల రోడ్డు ఏర్పడితే ఆ సమస్య తీరనుంది. కొత్తూరు, షాద్‌నగర్ పట్టణాల్లో రోడ్డు విశాలంగా మారడంతో పార్కింగ్ సమస్యలు తీరనున్నాయి. పాత హైవే చుట్టు పక్కన ఉన్న భూముల విలువ పెరిగి రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకోనుంది.
ఎన్నికల సమయంలో పాత జాతీయ రహదారిని ఆధునీక రిస్తామని ప్రజల కు మాట ఇచ్చిన. ఆ మాటను నేరవే రుస్తున్న. కొత్తూరు నుంచి షాద్‌నగర్ వరకు ఉన్న పాత జాతీయ రహ దారిని నాలుగు వరుసల దారిగా మారుస్తున్నాం. విశాలంగా రోడ్డు అం దుబాటులోకి రానున్నది. షాద్‌నగర్ మున్సిపాలిటీలో అద నంగా రోడ్లను నిర్మిస్తారు. ప్రజలకు ఇబ్బందులు కలుగ కుండా రోడ్డు పనులు సాగుతాయి. రోడ్డు నిర్మాణానికి సరిపడ నిధులు వచ్చాయి. ఇంకా అవసరమైతే నిధులు తెచ్చేందుకు కృషి చేస్తా.
షాద్‌నగర్,ఆగస్టు18: షాద్‌నగర్ నుంచి కొ త్తూ రు వరకు నూ తనంగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను ఏడాది కాలంలో పూర్తి చేస్తామని ఆర్అండ్ బీ ఈఈ శ్రవణ్ప్రకాశ్ తెలిపారు. బుధవారం షాద్‌నగర్ పట్టణంలో విలేకరులతో మా ట్లాడారు. రూ. 67.7 కోట్ల నిధులతో రోడ్డు ను ఆధునీకరిస్తున్నామని, నాలుగు వరుసల దారి గా మలుస్తున్నామని చెప్పారు. రెండో విడుతలో సర్వీస్ రోడ్లు, ఇతర వసతులను సమకూరుస్తామన్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా 22 వం తెనలు, కల్వర్టులను నిర్మించనున్నట్లు చెప్పారు. రోడ్డు విస్తరణ పనుల్లో 816 చెట్లను తొలగించే అవకాశం ఉందని, ఇం దులో 234 చెట్లను రోడ్డు మలుపు వద్ద రక్షించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిగిలిన చెట్లను సంరక్షించేందుకు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, చెట్ల ప్రేమికులు ముందుకు రావాలని కోరారు. చెట్ల ను సంరక్షించుకునేవారికి చెట్లను ఉచితంగా ఇస్తా మని, అందుకు బాండ్ పత్రం మీద చెట్టును సంరక్షిస్తామనే హామీ ఇవ్వాలన్నారు. చెట్లను ఉచితంగా పొందాలనుకునేవారు ఆర్ అండ్ బీ అధికారులను సంప్రదించాలన్నారు. షాద్‌నగర్ నుంచి తలకొండపల్లి వరకు ఉన్న రోడ్డును సైతం ఆధునీకరిస్తున్నామని, తలకొండపల్లి నుంచి ఆమనగల్లు వరకు ఉన్న ప్రధాన రహదారిని నాలుగు వరు సల దారిగా మార్చేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఆర్ అండ్ బీ డీఈ అర్జున్‌కుమార్, ఏఈలు రాజశేఖర్, సందీప్ అధికారులు పాల్గొన్నారు