చేవెళ్ల టౌన్, అక్టోబర్16: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండుగను శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. వాడవాడనా, శమి వృక్షాలు, జమ్మి కొమ్మలకు ప్రత్యేక పూజ లు చేసి, ఒకరికొకరు జిమ్మి ఆకు ఇచ్చి పుచ్చుకుని దసరా శుభా కాంక్షలు తెలుపుకొన్నారు. మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు స్వామి వారిని ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు అధిక సం ఖ్యలో తరలివచ్చారు.
ఘనంగా దుర్గమాత విగ్రహాల నిమజ్జనం మండల కేంద్రంలోని రచ్చబండ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర ఉదయం నుంచి సాయంత్రం వరకు వైభవంగా కొనసాగింది. క్రేన్ సహాయంతో చేవెళ్లలోని పుష్కరిణిలో అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశా రు. అనంతరం రాత్రి 9గంటలకు శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట జమ్మిచెట్టుకు పూజచేసి ఆశ్వవాహనంపై స్వా మి వారిని ఊరేగించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాతి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, సర్పంచ్ శైలజాఆగిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు నాగమ్మ, విఠలయ్య ఉన్నారు.
మొయినాబాద్‌లో..
మొయినాబాద్, అక్టోబర్16: తొమ్మిది రోజులపాటు భక్తులచే పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలను శనివారం నిమజ్జనానికి తరలించారు. చిలుకూరు గ్రామం అమ్మవారి నిమజ్జన ఊ రేగింపును కళాకారులు నృత్యాల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామానికి సమీపంలో ఉన్న పెద్ద చెరువులో అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు. అదేవిధంగా సురంగల్ గ్రామంలో పెద్ద చెరువులోనూ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో చిలుకూరు సర్పంచ్ స్వరూప, ఉపసర్పంచ్ సుధాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్, మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ, శ్రీరాములు, రాజు పాల్గొన్నారు.
‘జేఈఈ అడ్వాన్స్డ్’లో మెరిసిన చిలుకూరు గురుకుల విద్యార్థులు
మొయినాబాద్, అక్టోబర్16: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో చిలుకూరు గురుకుల కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఏకంగా 11 మంది విద్యార్థులు ఐఐటీకి అర్హత సాధించి చిలుకూరు గురుకులం పేరును చరిత్రలో నిలిపా రు. మొయినాబాద్ మండలం చిలుకూరు రెవెన్యూలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతున్న విద్యార్థులు ఎస్సీ విభాగంలో అనిల్‌కుమార్ 518వ ర్యాంకు, గణేశ్ 785వ ర్యాంకు, భరత్‌కుమార్ 1994 ర్యాంకు, ప్రశాం త్ 2338వ ర్యాంకు, ఓంప్రకాశ్ 2911వ ర్యాం కు, ఎస్టీ విభాగంలో నేతాజీ 769వ ర్యాంకు సాధించి వివిధ ఐఐటీల్లో నేరుగా ప్రవేశాలు పొందారు.
ఎం మధు, శ్యాంసన్, ఇంద్రకుమార్, ప్రవీణ్, శ్రీకాంత్ ప్రిపరేటరీ కోర్సులకు అర్హత సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సమన్వయ అధికారి శారదావెంకటేశ్, చిలుకూరు గురుకుల ప్రిన్సిపాల్ పాపారావు అధ్యాపకులు అభినందించారు.