షాబాద్, ఆగస్టు 16: దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, నవాబుపేట మండలాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వాహనాల్లో హుజూరాబాద్‌కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ. 10లక్షలు అందించడం సంతోషకరమన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. తరలివెళ్లిన వారిలో ఆయా మండలాల జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు గునుగుర్తి జయవంత్, సాత ప్రవీణ్‌కుమార్, నక్క శ్రీనివాస్‌గౌడ్, చింటు, దేవర కృష్ణారెడ్డి, రమేశ్‌యాదవ్, సూద యాదయ్య, కృష్ణగౌడ్, ముఖ్రంఖాన్, దేవేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రాజుగౌడ్, చంద్రశేఖర్, శ్రీనివాస్ ఉన్నారు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 16 : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు, దళిత, బహుజన నాయకులు తరలివెళ్లారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి బహిరంగసభకు వెళ్లే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.