షాద్‌నగర్, ఆగస్టు10 : అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో సర్పంచ్ మాధవి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కులాలకతీతంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దేశ ప్రధాని నుంచి రాష్ర్టాల ముఖ్యమంత్రులు సైతం తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును కొనియాడుతున్నారని చెప్పారు. భూముల ధరలు పెరుగుతున్నందున్న భూములను అమ్ముకోవద్దని సూచించారు. గ్రామంలో పల్లె ప్రగతి పనులు బాగున్నాయని మెచ్చుకున్నారు. పల్లె ప్రకృతి వనంలోని చెట్ల పెంపకాన్ని పరిశీలించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, కమ్యూనిటీ భవనాలు, మిషన్ భగీరథ ట్యాంక్‌లను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. మహిళా సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తు పత్రాలను మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ రామకృష్ణ, ఉప సర్పంచ్ నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, ఎంపీడీవో శరత్చంద్ర, ఎంఈవో శంకర్ రాథోడ్, పంచాయతీ రాజ్ ఈఈ చిరంజీవులు, నాయకులు మల్లేశ్‌యాదవ్, షశాంక్, షరీఫ్, చందు, పాల్గొన్నారు.
హాజరుకానున్న మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారం పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మంగళవారం తెలిపారు. కార్యక్రమానికి అథితులుగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.