జోరుగా ప్రవహిస్తున్న ఈసీ, మూసీ నదులు.. పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి చేరిన వరద నీరు
జల్పల్లి మున్సిపాలిటీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి
రంగారెడ్డి, అక్టోబర్ 9, నమస్తే తెలంగాణ : జిల్లాలో శుక్రవారం రాత్రి దాదాపు మూడు గంటల పాటు వర్షం దంచికొట్టింది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఓ మోస్త రు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలోని నందిగామ మండలంలో రికార్డు వర్షపాతం నమోదైంది. జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి మూ సీ, ఈసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నందిగామ మండలంలో అత్యధికంగా 133.8 మి.మీటర్ల వర్షపాతం నమోదుకాగా, సరూర్‌నగర్ మండలంలో 102.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. హయత్‌నగర్ మండలంలో 65.5 మి.మీటర్లు, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 60 మి.మీటర్ల వర్షపాతం నమోదుకాగా, కొత్తూరు మండలంలో 74.6 మి.మీటర్లు, ఫారూఖ్‌నగర్ మండలంలో 76.8 మి.మీటర్లు, చౌదరిగూడ మండలంలో 22.8 మి.మీటర్లు, కొందుర్గులో 26మి.మీటర్లు, షాబాద్ మండలంలో 64.2 మి.మీ టర్లు, చేవెళ్ల మండలంలో 19.3మి.మీటర్లు, మొయినాబాద్‌లో 34.6 మి.మీటర్లు, మహేశ్వరం మండలం లో 91.1 మి.మీటర్లు, కందుకూరులో 40.2 మి. మీటర్లు, కడ్తాల్‌లో 30.3 మి.మీటర్లు, కేశంపేటలో 30.5 మి.మీటర్లు, తలకొండపల్లిలో 47.4 మి.మీట ర్లు, ఆమనగల్లు మండలంలో 49.5 మి.మీటర్లు, మా డ్గులలో 53.8 మి.మీటర్లు, యాచారంలో 43.4 మి. మీటర్లు, మంచాల మండలంలో 32.1 మి.మీటర్లు, ఇబ్రహీంపట్నం మండలంలో 79.3 మి.మీటర్లు, రాజేంద్రనగర్ మండలంలో 81.8 మి.మీటర్లు, గండీపేట మండలంలో 13.8 మి.మీటర్లు, శేరిలింగంపల్లిలో 8.9 మి.మీటర్లు, శంకర్పల్లి మండలంలో 29.5 మి. మీటర్లు, బాలాపూర్‌లో 51.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఒక మండలంలో అతి భారీ వర్షపాతం నమోదుకాగా 8 మండలాల్లో భారీ వర్షపాతం, 16 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యింది. 2 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. యాచారం మండలంలోని చింతపట్ల లక్ష్మణ చెరువు 24 ఏండ్ల తర్వాత మత్తడి పోస్తున్నది. ధారూర్ మండల పరిధిలోని దోర్నాల్- ధారూరు స్టేషన్ గ్రా మాల మధ్య ఉన్న(కాగ్నా) వాగు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరం, శివా రు ప్రాంతాల్లోని చెరువుల మధ్య లింక్‌ల కోసం రూ. 850 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాజేంద్రనగర్‌లోని అప్పా చెరువు వద్ద నాలా నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు మె తెలిపారు. ఎటు చూసినా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకోవడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో..
మర్పల్లి 64.0, మోమిన్‌పేట 35.8, నవాబుపేట 9.4, వికారాబాద్ 52.2, పూడూరు 108.2, పరిగి 22.6, కుల్కచర్ల 8.2, దోమ 42.0, ధారూరు 24.6, బంట్వా రం 34.2, తాండూరు 11.2, యాలాల 34.4, పెద్దేముల్ 9.4, బషీరాబాద్ 7.4, బొంరాస్‌పేట 12.4, కొడంగల్ 20.8, దౌల్తాబాద్ 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా పూడూరులో 108.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.