సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ
మంచాల అక్టోబర్ 4 : మంచాల మండలం కాగజ్‌ఘాట్ గ్రామ సమీపంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం సోమవారం నెలకొన్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌ఘాట్ గ్రామ సమీపంలో ఉన్న అతి పురాతనమైన వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు ముఖద్వారాలు ధ్వంసం చేసి గర్భగుడిలో ఉన్న బండలను తొలగించి తవ్వకాలు జరిపారు. గుప్తనిధులు ఉంటాయనే ఆశతో దుండగులు తవ్వకాలు జరిపి ఉంటారని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, మంచాల సీఐ వెంకటేశ్‌గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ద్వారా వివరాలను సేకరించారు. ఈమేరకు మంచాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.