షాద్‌నగర్ టౌన్, అక్టోబర్3: బతుకమ్మ చీరల పంపిణీతో ఆడపడుచుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. మున్సిపాలిటీలోని 28వ వార్డు గాంధీనగర్‌కాలనీలో ఆదివారం బతుకమ్మ చీరలను ఆయన మహిళలకు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల పర్వదినాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. 16వ వార్డులో వైస్ చైర్మన్ నటరాజ్ బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. అదేవిధంగా 2వ, 5వ, 14వ, 20వ, 26వ వార్డుల్లో కౌన్సిలర్లు చెట్ల పావని, కృష్ణవేణి, బచ్చలి నర్సింహ, కొందూటి మహేశ్వరి, వెంకట్రాంరెడ్డి మహిళలకు చీరలను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కో-ఆప్షన్ సభ్యుడు కిశోర్, నాయకులు నర్సింలు, భాను, కిరణ్‌కుమార్, జయంత్, మనోహర్ పాల్గొన్నారు.
కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలాల్లో..
కొందుర్గు, అక్టోబర్3: కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మం డలాల్లోని ఆయా గ్రామాల్లో ఆదివారం మహిళలకు బతుక మ్మ చీరలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పం చ్ బాబురావు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్‌లో..
కొత్తూరు రూరల్, అక్టోబర్3: సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నదని కొత్తూరు ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్‌లో సర్పంచ్ సాయిలు ఆధ్వర్యంలో ఆదివారం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై 18 ఏండ్ల నిండి తెల్ల రేషన్ కార్డులో పేరున్న ప్రతి మహిళకూ బతుక మ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
కక్కులూర్లో..
షాబాద్, అక్టోబర్3: రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కక్కులూర్ సర్పంచ్ మమత అన్నారు. ఆదివారం ఆమె కక్కులూర్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ జీవన్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.