పెద్దఅంబర్‌పేట, అక్టోబర్3: అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో అభివృద్ధిపై దృష్టి సారించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సుమారు రూ.రెండున్నర కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వారు శంకుస్థాపన చేశా రు. ఇందుఅరణ్య పల్లవి అపార్ట్మెంట్లో రూ.23లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కౌన్సిలర్ రోహిణీబ్రహ్మానందరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా తట్టిఅన్నారం నుంచి మర్రిపల్లి వరకు రూ. 32లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి కౌన్సిలర్లు గీతావేణుగొపాల్రెడ్డి, అర్చనలతో, అదేవిధంగా కుంట్లూర్ వైజంక్షన్ నుంచి ఆర్జీకే రోడ్డు వరకు రూ. కోటీ95లక్షలతో చేపట్టనున్న బీటీరోడ్డు పనులకు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్ ఖమర్ అహ్మ ద్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బ్యాంక్ డైరెక్టర్ కళ్లెం ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్యదర్శి దామోదర్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు సుమన్‌రెడ్డి, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బలరాం, సత్యనారాయణరెడ్డి, విజయేందర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డి, గోపాల్, భాస్కర్‌గౌడ్, జగన్, వెంకటేశ్, శ్రీనివాస్‌రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.
మురుగు తరలింపునకు రూ. 32 కోట్లు
పెద్దఅంబర్‌పేట, అక్టోబర్3: కుంట్లూర్ గ్రామ మురుగును భూదాన్కాలనీ నుంచి మూసీనదిలోకి తరలించేందుకు ప్రభుత్వం రూ.32 కోట్లను కేటాయించిందని, మరో నాలుగైదు నెలల్లో పనులు ప్రారంభమవుతాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కుంట్లూర్ భూదాన్కాలనీలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది కావాలని గొడవ లు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. నూతన కార్యవర్గం, యూత్ విభాగం, మహిళా విభా గం సభ్యులంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. భూదాన్కాలనీలోని పార్కులో కొంతమంది స్థానిక నాయకులు కబ్జాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయాన్ని అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు, కౌన్సిలర్ కృష్ణారెడ్డి, రేణుక, వెంకటేశ్, రాము, శ్రీనివాస్‌రెడ్డి, బాబురావు, నాగార్జున పాల్గొన్నారు.
పలువురు టీఆర్ఎస్లో చేరిక
యాచారం, అక్టోబర్3: టీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షం లో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ముఖ్యంగా దళితబంధు పథ కం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బండిమీది కృష్ణ, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాష, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కృష్ణ, శ్రీను, శివలింగం, జంగయ్య, జైపాల్‌రెడ్డి, యాదయ్య తదితరులున్నారు.
వారి సేవలు మరువలేము
ఇబ్రహీంపట్నం, అక్టోబర్3: ఉప్పరిగూడ సహకారసం ఘం మాజీ చైర్మన్ నల్లబోలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహదేవ్ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సింగిల్‌విండో మాజీ చైర్మన్ అంజిరెడ్డి, మహదేవ్‌ల ప్రథమ వర్ధంతిని ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యేతోపాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి హాజరై వారి చిత్రపటాలకు నివాళులర్పించారు.