రంగారెడ్డి జిల్లా రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టారు. తాసిల్దార్ మొదలుకొని ఆఫీస్ సబార్డినేట్ వరకు 115 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ అమయ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలంగా అంటే రెండేండ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కల్పించారు. బదిలీ అయినవారిలో సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లే ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా ఐదుగురు తాసిల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తాసిల్దార్లు ఉన్నారు.
రంగారెడ్డి, అక్టోబర్2(నమస్తే తెలంగాణ): జిల్లా రెవెన్యూ శాఖలో భారీగా ప్రక్షాళన జరిగింది. తహసీల్దార్ మొదలుకొని ఆఫీస్ సబార్డినేట్ వరకు బదిలీ చేస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు శనివారం రెవెన్యూశాఖకు సంబంధించిన 115 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ కలెక్టర్ అమయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న, రెండేండ్లకు పైబడి ఒకేచోట ఉన్న ఉద్యోగులకు స్థానచలనం కల్పించారు. బదిలీ అయిన వారిలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారు. అయితే బదిలీ అయిన వారిలో సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లే ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా ప్రక్షాళనలో భాగంగా స్థానచలనం కల్పించడంతోపాటు సీనియ ర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న వారిని సీనియర్ అసిస్టెంట్లుగా బదిలీ చేశారు. ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతోనే చాలామంది సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను బదిలీ చేసినట్లు సమాచారం. బదిలీల్లో భాగంగా ఐదుగురు తహసీల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు-34 మంది, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్స్-74 మంది ఉన్నారు. వీరం తా శనివారమే ఆయా స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి..