మొయినాబాద్, సెప్టెంబర్ 1 : ఈసీ వాగు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గంగమ్మ పరవళ్లు తొక్కుతున్నది. దీంతో ఈసీ వాగు అందాలను ఆస్వాదించడానికి ప్రజలు వాగులో ఉన్న రాళ్లు గుట్టలపై కూర్చుని గంగమ్మ తల్లి పరవళ్లను తిలకిస్తున్నారు. వెంకటాపూర్ సమీపంలో నిర్మించిన కత్వ వద్ద నీటి ప్రవాహాన్ని చూడడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని ప్రవాహ తీరును తిలకిస్తున్నారు.