యాచారం, సెప్టెంబర్30: బృహత్ పల్లె ప్రకృతివనం పనులు భేషుగ్గా ఉన్నాయని ఐఏఎస్ అధికారి కదివరన్ ఫలన్ మెచ్చుకు న్నారు. మండల కేంద్రంలో ఆరు ఎకరాల్లో ఏర్పాటు చేసిన బృహ త్ పల్లెప్రకృతివనంలో పెంచుతున్న మొక్కలను గురువారం ఆయ న డీఆర్డీఏ పీడీ ప్రభాకర్తో కలిసి పరిశీలించారు. అందులో నా టిన 47 రకాలకు చెందిన 15వేల మొక్కలను స్వయంగా పరిశీలించారు. ఆహ్లాదాన్ని పంచుతున్న చిత్రలేఖనం చూసి ముసిరిపోయా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బృహత్పల్లెప్రకృతివనంలోని ప్రతి మొక్కనూ సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో మరో మొక్కను నాటాలన్నారు. అదేవిధంగా బృహత్ పల్లెప్రకృతి వనం చుట్టూ కంచెతోపాటు ముఖద్వారాన్ని ఏర్పాటుచేసి గేటు అమర్చాలన్నారు. మండలంలో ఏర్పా టు చేసిన బృహత్ పల్లె ప్రకృతివనం మాదిరిగా మేజర్ గ్రామపంచాయతీల్లో ఎకర స్థలంలో ఏర్పాటు చేయాలన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరుపోసి సంరక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పల్లెప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, నర్సరీల పనులను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తయ్యేలా అధికారులు దృష్టి సారించాలని సూచిం చారు. అనంతరం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడి పలు రికార్డులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఈజీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.