హయత్‌నగర్, సెప్టెంబర్30: సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘం నూతన చైర్మన్‌గా గంగుల కృష్ణారెడ్డి గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మదర్‌డెయిరీ సంస్థ మిగతా సంస్థలకు పోటీ పడేలా ముందుకెళ్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వా త సీఎం కేసీఆర్ మూతపడ్డ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందజేసి ఉద్యోగులకు అండగా నిలిచారని కొనియాడా రు. వ్యవసాయానికి అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ వృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ అన్ని విధాలా అండగా ఉంటున్నదన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నష్టాల్లో సాగిన మదర్ డెయిరీ సంస్థను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త కార్యవర్గం వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసిందని, ప్రస్తుతం ఎన్నికైన నూతన కార్యవర్గసభ్యులు కూడా ఈ సంస్థను లాభాల బాటలో కొనసాగించాలని ఆకాంక్షించారు. సంస్థకు పాడి రైతులు, ఉద్యోగులే కీలకమని వారు తమ వంతు బాధ్యతగా మెలిగి అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.
మదర్ డెయిరీ సంస్థను అభివృద్ధి చేయాలి
ప్రస్తుతం ఆలేరు నియోజకవర్గంలో పాల ఉత్పత్తులు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. పాల ఉత్పత్తుల్లో ఆలేరు ముందుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మదర్ డెయిరీ సంస్థ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి 13 ఏండ్లుగా సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని.. కొత్త చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, పాలకవర్గాన్ని, సంస్థ ఉద్యోగులను, పాడి రైతులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా వక్తలు సూచించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, రవీందర్‌నాయక్, నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆల్డా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, మదర్ డెయిరీ సంస్థ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, డైరెక్టర్లు చల్లా సురేందర్‌రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, కోట్ల జలేంధర్‌రెడ్డి, గూడూరు శ్రీధర్‌రెడ్డి, కే.జయశ్రీ, కే.అలివేణి, సొసైటీ అధ్యక్షులు, పాడి రైతులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిరణ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, భాస్కర్‌సాగర్, బాలకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.