ఉమ్మడి జిల్లాలో సర్కార్ సారె పంపిణీ నేటి నుంచి షురూ కానున్నది. బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు ఏటా చీరల పంపిణీ చేపడుతున్నది. ఈసారి కూడా అందించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లాలో అర్హులైన ఆడపడుచులు 7,28,154 మంది ఉండగా.. వికారాబాద్ జిల్లా పరిధిలో 3,29,629 మంది ఉన్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అందిస్తున్న సర్కారు సారె పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ రంగారెడ్డి జిల్లా లో ప్రారంభం కానుంది. కందుకూరు మండలంలోని కొత్తూ రు, మొయినాబాద్ మండలంలోని మార్కెట్ కమిటీ గోదాంల నుంచి జిల్లాలోని 21 మండలాల్లోని గ్రామాలు, 16 మున్సిపాలిటీలకు అందజేయనున్నారు. జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో అర్హులైన ఆడపడుచులకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఈ చీరలను అందజేస్తారు. జిల్లాలో అర్హులైన ఆడపడుచులు 7,28,154 మంది ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 3,08,452మంది, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 4,19, 702 మంది ఉన్నారు. ఇప్పటివరకు 60శాతానికిపైగా చీరలు జిల్లాలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పంపిణీని బట్టి చీరలు జిల్లాకు రానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 3,96,880 బతుకమ్మ చీరలు జిల్లాకు చేరుకున్నాయి. బతుకమ్మ చీరలను గ్రామాలకు ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లోని వార్డులకు కమిషనర్లు తరలించే బాధ్యత తీసుకోనున్నా రు. బతుకమ్మ చీరల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేతోపాటు ఇత ర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. చీరల పంపిణీకి సంబంధించి కమిటీలను ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవోలతో కూడిన కమిటీ, గ్రామస్థాయి లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ మహిళా సంఘం సభ్యులు, రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో, అదేవిధంగా మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు, రేషన్‌డీలర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే మొయినాబాద్‌లోని మార్కెట్ కమిటీ గోదాం నుంచి చేవెళ్ల, షాద్‌నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు, కొత్తూరు గోదాం నుంచి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాలకు చీరలను సరఫరా చేయనున్నా రు. జిల్లాకు పోచంపల్లి, సిరిసిల్ల, కోయిలకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతా ల్లో రెడీ చేసిన బతుకమ్మ చీరలు వచ్చాయి.
వికారాబాద్ జిల్లాలో ..
పరిగి, సెప్టెంబర్30: తెల్ల రేషన్‌కార్డులో పేరున్న 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకూ బతుకమ్మ చీరను పంపిణీ చేసేందు కు వికారాబాద్ జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పరిధిలోని 18 మండలాల్లో 3,29,629 బతుకమ్మ చీరలను శుక్రవారం నుంచి పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని బషీరాబాద్ మండలంలో 15,689 బతుకమ్మ చీరలు, దౌల్తాబాద్‌లో 17,969, కొడంగల్‌లో 18,178, పెద్దేముల్లో 16,818, తాండూరు మండలం, తాండూరు మున్సిపాలిటీల్లో 40,688, యాలాల్లో 16,960, బంట్వారంలో 7,597, ధారూర్‌లో 14,564, కోట్‌పల్లిలో 8,419, మర్పల్లిలో 18,294, మోమిన్‌పేట్‌లో 15,246, నవాబుపేట్‌లో 14,967, వికారాబాద్ మండలం, వికారాబాద్ మున్సిపాలిటీల్లో 29,200, బొంరాస్‌పేట్‌లో 20,755, దోమలో 17, 397, కులకచర్లలో 19,921, పరిగి మండలం, మున్సిపాలిటీల్లో 20,969, పూడూరు మండలంలో 15,998 చీరలను ఆడపడుచులకు అందజేయనున్నారు.
మూడు గోదాముల్లో స్టాకు నిల్వ
జిల్లా పరిధిలోని ఆయా మండలాల్లో పంపిణీ చేయాల్సిన బతుకమ్మ చీరలను మూడు ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ ఉంచారు. తాండూరు సమీపంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం ఖాంజాపూర్, పరిగిలోని ఇండోర్ స్టేడియం, వికారాబాద్‌లోని మార్కెట్ గోదాముల్లో నిల్వ చేసి అక్కడి నుంచి ఆయా మండలాలు, మున్సిపాలిటీలకు పంపిణీ చేయనున్నా రు. ఇదిలాఉండగా ఖాంజాపూర్ ఏఎంసీ గోదాముకు 1,11, 700 బతుకమ్మ చీరలు రాగా, అందులో 69,923 చీరలను పంపిణీ చేయగా 41,777 చీరలు ఉన్నాయి. వికారాబాద్‌లోని ఏఎంసీ గోదాముకు 43,000 చీరలురాగా 34, 581 పంపిణీ చేయగా 8,419 చీరలు ఉన్నాయి. పరిగిలోని ఇం డోర్ స్టేడియానికి 58,300 చీరలు రాగా, 20,755 పంపిణీ చేయగా 37,545 చీరలున్నాయి. జిల్లాకు మొత్తం 2,13,000 చీరలు రాగా, అందులో 1,25,259 చీరలను మండలాలకు తరలించారు. మిగతా చీరలు కూడా రెండు, మూడు రోజుల్లో జిల్లాకు రానున్నాయి.
జిల్లాలో 3,29,629 బతుకమ్మ చీరల పంపిణీ
వికారాబాద్ జిల్లాలో 3,29,629 బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 2,13,000 చీరలు జిల్లాకు చేరగా, మిగతా చీరలు రెండు,మూడు రోజుల్లో రానున్నాయి. జిల్లాలో మూడుచోట్ల గోదాముల్లో స్టాకును నిల్వ ఉంచి ఆయా మండలాలకు చీరలను తరలిస్తున్నాం. కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలో శుక్రవారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీప్రారంభం కానుంది.
ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటివరకు జిల్లాకు 60శాతానికిపైగా చీరలొచ్చాయి. మిగతా చీరలు పంపిణీని బట్టి రానున్నాయి. బతుకమ్మ చీరల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అర్హులైన ప్రతి ఆడపడుచుకు సర్కారు సారెను అందిస్తాం.
-అమయ్‌కుమార్, రంగారెడ్డి కలెక్టర్