వేములవాడ, ఏప్రిల్ 9 : మైదానంలో క్రికెట్ ఆట మామూలే.. కానీ, బాక్స్ క్రికెట్ ఇప్పుడు భలే క్రేజీగా మారింది. కేవలం హైదరాబాద్, ముంబై వంటి మహానగరాలకే పరిమితమైన ఈ బాక్స్ క్రికెట్ వేములవాడకు కూడా వచ్చింది. భీమేశ్వరగార్డెన్లో ఏర్పాటు చేయగా, పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల క్రీడాకారులు, కొత్తగా నేర్చుకునే వారు ఆటపై ఆసక్తి చూపుతున్నారు. గంటకు సుమారు రూ.500 వరకు నిర్వాహకులు ఫీజు తీసుకుంటుండగా ఉదయం, రాత్రి వేళల్లో కూడా ఆడుకునేందుకు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆరుగురు మాత్రమే ఆడే అవకాశం ఉండగా, బాక్స్ క్రికెట్లో ఆరు ఓవర్లలో తక్కువ బరువు ఉన్న టెన్నిస్‌బాల్‌తో ఆటను నిర్వహిస్తారు. ఇందులో బాక్స్‌లోని బ్యాట్స్‌మెన్ ఎదురుగా ఉన్న నెట్‌కు నేరుగా తగిలితే 6 పరుగులు, కింది నుంచి వెళ్తే 4 పరుగులు, ఒక వేళ ఫిల్డర్ చేతికి బంతి దొరికితే సింగిల్స్ తీసుకునే విధానం ఉంది. మొత్తం గ్రౌండ్లో నలుగురు ఫిల్డర్స్ మాత్రమే ఉంటారు. ఆట పరిమితి సమయం 15 నిమిషాలు కాగా, ఇరువురితో కలిపి 30 నిమిషాల సమయం ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
కోహ్లి, మ్యాక్స్‌వెల్ అవుట్.. కష్టాల్లో బెంగళూరు
రాష్ట్ర ప్రగతికి జగన్ చేసిందేమిటి.. నిలదీసిన బాబు