ఇచ్చోడ, ఏప్రిల్ 4 : యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నాయకులు రాస్తారోకో చేశారు. అనంతరం తహసీల్దార్ అతిఖొద్దీన్కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, మాజీ ఎంపీపీ సుభాష్‌పాటిల్, ఎంపీటీసీ సుభాష్, నాయకులు గణేశ్, అబ్దుల్ రషీద్, రాథోడ్ ప్రవీణ్, గ్యాతం గంగయ్య, భీముడు, గుండాల శ్రీకాంత్, సుధాకర్, రామేశ్వర్, సురేందర్‌రెడ్డి, ప్రకాశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
భీంపూర్, ఏప్రిల్ 4 : ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. కార్యక్రమంలో ఎంపీపీ రత్నప్రభ, వైస్‌ఎంపీపీ గడ్డం లస్మన్న, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎం అనిల్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్యయాదవ్, సర్పంచ్‌లు భూమన్న, బాదర్, మడావి లింబాజీ, పెండెపు కృష్ణయాదవ్, బక్కి అజయ్‌యాదవ్, ఎంపీటీసీలు, నాయకులు జహూర్ అహ్మద్, నరేందర్‌యాదవ్, బక్కి కపిల్యాదవ్, ఎం కల్చాప్యాదవ్, జాదవ్ రవీందర్, రాథోడ్ ఉత్తమ్, దొంతుల సుభాష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
తలమడుగు, ఏప్రిల్ 4 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోక జీవన్ రెడ్డి మాట్లాడూతూ కేంద్ర ప్రభుత్వం రైతులపై తీరు మార్చుకోకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఝరి పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కిరణ్, మగ్గిడి ప్రకాశ్, దేవ్‌రావ్, సల్ల సుధాకర్, ఆశన్న యాదవ్, సునీత రెడ్డి, పల్లవి, తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ, ఏప్రిల్ 4 : కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ మండల కన్వీనర్ బాలాజీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో తహసీల్దార్ సర్ఫరాజ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అశోక్, ఎంపీటీసీ సూర్యప్రకాశ్, నాయకులు బషీర్, సూర్యప్రకాశ్, ఈశ్వర్, యాదవ్రావ్, శంకర్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, ఏప్రిల్ 4 : కేంద్రప్రభుత్వం బేషరతుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో ఇచ్చోడ-సొనాల ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం నాయకులు సాయన్న, మధుకర్, ఈశ్వర్, విలాస్, జగదీశ్, ప్రకాశ్ పాల్గొన్నారు.
నేరడిగొండ, ఏప్రిల్ 4 : తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండిస్తున్న ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జడ్పీటీసీ జాదవ్ అనిల్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, వైస్‌ఎంపీపీ మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు పెంట వెంకటరమణ, విశాల్‌కుమార్, జాదవ్ సుభాష్, జాదవ్ రమేశ్, నాయకులు సయ్యద్ జహీర్, రమేశ్, కుంట కిరణ్‌కుమార్‌రెడ్డి, కమల్‌సింగ్, నారాయణ, తులసీరాం, తదితరులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, ఏప్రిల్ 4 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో నాయకులు పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై పక్షపాతాన్ని విడనాడి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జలంధర్, రాజేశ్వర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.