
మందమర్రి రూరల్, జనవరి 14 :నిత్యం యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఎంవీటీసీ మేనేజర్ శంకర్, కేకే ఓసీ పీవో రమేశ్ అన్నారు. భారత్ కీ ఆజాదీకా ఆమృత్ మహోత్సవంలో భాగంగా జీఎం చింతల శ్రీనివాస్ నేతృత్వంలో శుక్రవారం స్థానిక ఎంవీటీసీలో సూర్యనమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి రోజు యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. యోగా లో సూర్యనమస్కారాలకు ప్రత్యేకత ఉందన్నారు. మనిషిలో తేజస్సు, కండర పుష్టి ధృడత్వం, రక్త ప్రసరణ, చర్మ సౌదర్యం, అతి బరువు తగ్గిస్తున్నదని, నరాల వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుందన్నారు. ఇళ్లల్లో ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని సూచించారు. కేకే ఓసీ లో ఉద్యోగులు, అధికారులు సూర్యనమస్కారాలు చేశారు. కార్యక్రమంలో యోగా గురువులు రమేశ్ కుమార్, రాజ కొమురయ్య పాల్గొన్నారు.
శ్రీరాంపూర్, జనవరి 14 : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా శ్రీరాంపూర్ ఓసీపీపై శుక్రవారం అధికారులు, కార్మికులు, ఉద్యోగులు సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేశారు. మేనేజర్ జనార్దన్ ఆధ్వర్యంలో యోగా గురువు రాజేశ్వర్ కార్మికులు, ఉద్యోగులతో ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిత్యం యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారని చెప్పారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, అదనపు మేనేజర్ వీరయ్య, ఈఈ రాజారవిచరణ్, శ్యాంసుందర్‌రావు, సారంగపాణి, సీనియర్ పీవో బొంగోని శంకర్ పాల్గొన్నారు.