గ్రామల్లో సంబురంగా బతకుకమ్మ చీరల పంపిణీ
నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 5 : జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు. పేదవర్గాలవారు పండుగలను సంతోషంగా నిర్వహించుకునేందుకు రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ సంబురాల సందర్భంగా కొత్త బట్టలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు.
లింగంపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నతపాఠశాలలో ఎంపీపీ గరీబున్నీసా బేగం, సర్పంచ్ లావణ్య, జడ్పీటీసీ శ్రీలత, రైతుబంధు సమితి మండల కన్వీనర్ విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీటీసీ షమీమున్నీసాబేగం, ఎంపీడీవో శంకర్‌నాయక్, నాయబ్ తహసీల్దార్ చంద్రరాజేశ్, మండల కో-అప్షన్ సభ్యుడు బాబుజానీ, ఏపీఎం శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ నరహరి, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు శోభ, నాయకులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, మల్లూర్‌లో వైస్ ఎంపీపీ మనోహర్, కొమలంచలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు చీరలను అందజేశారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, ఏఎంసీ ఉపాధ్యక్షుడు విఠల్ పాల్గొన్నారు.
బిచ్కుంద మండలం మాన్యాపూర్లో సర్పంచ్ రాములు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. గోపన్‌పల్లిలో సర్పంచ్ శ్రీనివాస్, సిర్సముందర్లో సర్పంచ్ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ ఓంకార్ చీరలను అందజేశారు.
గాంధారి మండలం ముదెల్లి, వెంకటాపూర్ తండా తదితర గ్రామాల్లో ఎంపీపీ రాధాబలరాం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముదెల్లి సర్పంచ్ కళావతి, విండో డైరెక్టర్ ప్రసాద్‌రావు, లక్ష్మణ్, అంజయ్య పాల్గొన్నారు.
తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్, కరడ్‌పల్లి, కృష్ణాజివాడి, చందాపూర్, తాడ్వాయి గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగింది. ఎర్రాపహాడ్‌లో సర్పంచ్ నర్సారెడ్డి, సొసైటీ చైర్మన్ కపిల్‌రెడ్డి, ఎంపీటీసీ జలంధర్‌రెడ్డి, ఉప సర్పంచ్ బాలాజీ మహిళలకు చీరలను అందజేశారు.
నాగిరెడ్డిపేట్ మండలం అచ్చయిపల్లి, రామక్కపల్లిలో సర్పంచ్ శైలజ, జాన్కంపల్లిలో సర్పంచ్ సాయిలు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
రామారెడ్డి మండలం మద్దికుంట, అన్నారం, ఉప్పల్వాయి గ్రామాల్లో బతుకమ్మ చీరలను ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.
పిట్లం మండలంలోని గౌరారం తండాలో ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీబాయి బాబూసింగ్, సర్పంచ్ రవి, అల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ నారాయణరెడ్డి, జగదాంబ తండాలో సర్పంచ్ వినోద మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మోహన్, వాగ్దేవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్ మండలంలోని లింబూర్ గ్రామంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్‌పటేల్, వైస్ ఎంపీపీ జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరలను జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, ఎంపీపీ సదానంద పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజలి, ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, తహసీల్దార్ మోతీసింగ్, నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో సర్పంచ్ పుల్లెన్ బాబురావు, అన్నారంలో సర్పంచ్ మునిగె కిష్టారెడ్డి, రైతునగర్‌లో గ్రామ సర్పంచ్ మద్దినేని నాగేశ్వర్రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచులు నర్సారెడ్డి, నాగమణి, నాయకులు, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్, దుర్కి, సంగెం, హాజీపూర్, అంకోల్, అంకోల్ తండా గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగింది. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు పురం లక్ష్మి, దుర్గం శ్యామల, పాల్త్య లక్ష్మి, విండో చైర్మన్లు దివిటి శ్రీనివాస్, మారుతి, నాయకులు వెంకటి, గంగారాం, ఐకేపీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.